Last Updated:

Garlic Prices: పెరుగుతున్న వెల్లుల్లి ధరలు.. ఆందోళనలో వినియోగదారులు

గత కొద్ది కాలంగా వినియోగదారులకు చుక్కలు చూపించిన ఉల్లి, టమాటాల స్దానంలో తాజాగా వెల్లుల్లి చేరింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వెల్లుల్లి ధర సుమారుగా రూ.400 కు చేరుకుంది. ఉల్లిపాయల సరఫరాలో కొరత ఏర్పడిన తరువాత దాని స్దానంలో వెల్లుల్లి వినియోగం పెరగడంతో దీని ధర అనూహ్యంగా పెరుగుతోంది.

Garlic Prices: పెరుగుతున్న వెల్లుల్లి ధరలు.. ఆందోళనలో వినియోగదారులు

Garlic Prices: గత కొద్ది కాలంగా వినియోగదారులకు చుక్కలు చూపించిన ఉల్లి, టమాటాల స్దానంలో తాజాగా వెల్లుల్లి చేరింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వెల్లుల్లి ధర సుమారుగా రూ.400 కు చేరుకుంది. ఉల్లిపాయల సరఫరాలో కొరత ఏర్పడిన తరువాత దాని స్దానంలో వెల్లుల్లి వినియోగం పెరగడంతో దీని ధర అనూహ్యంగా పెరుగుతోంది.

ప్రధాన రాష్ట్రాల్లో వెల్లుల్లి ధరలు ..(Garlic Prices)

ఉత్తరప్రదేశ్‌లో వెల్లుల్లి ధర రూ. 80 నుంచి రూ.130 రూపాయలుగా ఉంది. మహారాష్ట్రలో రూ. కిలో 230 నుంచి 340కు, రాజస్థాన్‌లో రూ. కిలో 80 నుంచి 170కి, పంజాబ్ లో రూ. కిలో 50 నుంచి రూ. కిలో 200 వరకూ ఉంది. కొత్త పంట మార్కెట్‌కు రాని వరకు అంటే సంవత్సరం చివరి వరకు ఈ పెంపు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.సాధారణంగా, దిగుబడి మరియు సరఫరా తక్కువగా ఉన్నందున శీతాకాలంలో వెల్లుల్లి ధర పెరుగుతుంది.అకాల వర్షాల వల్ల చాలా వరకు పంటలు దెబ్బతిన్నందున దేశవ్యాప్తంగా వెల్లుల్లి సరఫరా తగ్గిపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.ధరలను తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, రేట్లు రిటైల్‌లో కిలో రూ.300-400 వరకూ మరియు హోల్‌సేల్‌లో రూ.200 వద్ద స్థిరంగా ఉన్నాయి.