Home / Latest National nerws
ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియా కూటమి తేలికగా కొట్టిపారేసింది. 2024 లోకసభ ఎన్నికలల్లో ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్‌పోల్స్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. కాగా దేశంలోని పలు చానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్నీ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘనవిజయం సాధిస్తుందని అంచనా వేశాయి.
CEC Rajiv kumar: భారతీయ ఎన్నికలు ఓ అద్భుతమని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌కుమార్ సోమవారం నాడు అన్నారు. మంగళవారం నాడు కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 642 మిలియన్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఓ చారిత్రక రికార్డు అని ఆయన అన్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ అంటే దళారుల దందా గుర్తుకువస్తుంది . ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనంటే ఆర్టీఓ ఆధ్వర్యంలో ట్రాక్ టెస్టులో పాల్గొనాలి . స్లాట్ బుక్ చేసుకోవాలి ఆర్టీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేయాలి .దింతో వాహన దారులకు చాలా సమయం వృధా అవుతుంది .ఇప్పుడు వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ నేరుగా కన్యాకుమారి వెళ్లారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్‌లో రెండు రోజుల పాటు ఆయన ధ్యానం చేస్తున్నారు.
బంగారాన్ని తన శరీర రహస్య భాగాల్లో దాచుకుని స్మగ్లింగ్ చేసిన ఒక ఎయిర్‌హోస్టెస్‌ను కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో ఎయిర్ హోస్టెస్‌ను అరెస్టు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) శుక్రవారం తెలిపింది. దీనికి సంబందించి డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు అరెస్టు చేశారు. వెంటనే ప్రజ్వల్‌ను సీఐడి కార్యాలయానికి తరలించి విచారణ మొదలుపెట్టారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఇటీవల పూనేలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు మద్యం మత్తులో తన ఖరీదైన పోర్ష్ కారుతో మోటార్ సైకిల్‌పై వెళ్తున్నఓ జంటను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారకుడయ్యాడు. అప్పటి నుంచి ఈ అంశం కాస్తా జాతీయ పతాక శీర్షికను ఆకర్షిస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది.
ఎట్టకేలకు దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ 'అగ్నిబాణ్'ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన అగ్నిబాణ్ ను షార్‌లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి గురువారం ఉదయం 7:15 గంటల సమయంలో రాకెట్‌ను సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించారు.
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రాంరహీం సింగ్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టులో మంగళవారం భారీ ఊరట లభించింది. డేరా మేనేజర్ రంజీత్‌సింగ్ హత్యలో కోర్టు డేరా చీఫ్‌తో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీకి బిహార్ ఎన్నికల ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. బిహార్‌లోని పాలీగంజ్‌లో సోమవారం ఇండియా కూటమి ర్యాలీలో స్టేజ్‌లో కొంత భాగం కూలింది. కాగా స్టేజీపై రాహుల్‌గాంధీతో పాటు రాష్ర్టీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నారు.