Prajwal Revanna: ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్టు!!
కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు అరెస్టు చేశారు. వెంటనే ప్రజ్వల్‌ను సీఐడి కార్యాలయానికి తరలించి విచారణ మొదలుపెట్టారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
Prajwal Revanna: కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు అరెస్టు చేశారు. వెంటనే ప్రజ్వల్‌ను సీఐడి కార్యాలయానికి తరలించి విచారణ మొదలుపెట్టారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ప్రజ్వల్ కు వైద్యపరీక్షలు..(Prajwal Revanna)
ప్రజ్వల్‌ను వైద్య పరీక్షల నిమిత్తం బౌరింగ్ అండ్ లేడీ కుర్జాన్ ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఆస్పత్రి చుట్టుపక్కల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోని ఆయన బ్లడ్‌ప్రెషర్, బ్లడ్ షుగర్ టెస్టులతో పాటు ఇతర హెల్త్ చెకప్ చేశారు. దీంతో పాటు సిట్ ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.వైద్యపరీక్షల తర్వాత రెవెన్నను సిటి సివిల్ కోర్టులో హాజరు పర్చారు. సిట్ 14 రోజుల కస్టడీ కోరితే కోర్టు ఆరు రోజుల కస్టడీ అనుమతిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. అయితే రెవన్న అడ్వకేట్ అరుణ్‌ను సిట్ కస్టడీలో ఉన్నప్పుడు రెవన్నను కలవడానికి ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య అనుమతించింది.ప్రజ్వల్‌ను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ను గురువారం నాడు కోర్టు తిరస్కరించింది. కాగా ప్రజ్వల్‌తో పాటు ఆయన తల్లి భవాని బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం ప్రత్యేక కోర్టు విచారించే అవకాశం ఉంది.
ప్రజ్వల్ తల్లిపై కిడ్నాప్ కేసు..
ప్రజ్వల్ అరెస్టు గురించి రాష్ర్ట హోంమంత్రి జి పరమేశ్వర్ వివరించారు. ప్రజ్వల్ రెవన్న మ్యూనిచ్ నుంచి బెంగళూరుకు గురువారం అర్ధరాత్రి 12.40 నుంచి 12.50 మధ్య ల్యాండ్ అయ్యారు. ఆయనపై అప్పటికే అరెస్టు వారెంట్ ఉంది. చట్టప్రకారం సిట్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి చివరి యత్నంగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని హోంమంత్రి చెప్పారు. కాగా ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా మూడు లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. ఆయన తల్లిపై కూడా కిడ్నాప్ కసు నమోదు అయ్యింది. ఆమె కూడా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని హోంమంత్రి చెప్పారు. అయితే ఈ కేసులో ఆమె నిందితురాలు కాకపోయినా.. సిట్ అధికారులు ఆమెను కూడా విచారించాలని నిర్ణయించారు.
మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు అయిన ప్రజ్వల్ తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని.. కుట్రలో భాగమని అంటున్నారు. తాను ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని కాబట్టి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన సెషన్‌కోర్టులో పిటిషన్ వేశారు. కాగా ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేపులు కర్ణాటక అతి పెద్ద రాజకీయ దుమారం రేపింది. అధికార కాంగ్రెస్, బీజేపీ, జెడీ-ఎస్‌యులు ఒకరిపై ఒకరు దుమ్ముత్తి పోసుకున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. బీజేపీ- జెడీ ఎస్‌లు మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సెక్సువల్ వీడియోల వెనుక ఎవరి హస్తం ఉందో తేలాలని బీజేపీ, జెడీ ఎస్ కోరుతున్నాయి.