Last Updated:

Mallikarjun Kharge: ఇంట్లోనే ధ్యానం చేసుకోవచ్చు కదా.. ప్రధాని మోదీ పై మండిపడ్డ మల్లిఖార్జున ఖర్గే

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ నేరుగా కన్యాకుమారి వెళ్లారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్‌లో రెండు రోజుల పాటు ఆయన ధ్యానం చేస్తున్నారు.

Mallikarjun Kharge: ఇంట్లోనే ధ్యానం చేసుకోవచ్చు కదా.. ప్రధాని మోదీ పై మండిపడ్డ మల్లిఖార్జున ఖర్గే

Mallikarjun Kharge: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ నేరుగా కన్యాకుమారి వెళ్లారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్‌లో రెండు రోజుల పాటు ఆయన ధ్యానం చేస్తున్నారు. దీనిపై ఖర్గే మోదీపై మండిపడ్డారు. మీకు దేవుడిపై అంత నమ్మకం ఉంటే మీ ఇంట్లోనే ధాన్యం చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. రాజకీయాలు.. మతాలు రెండు ఎప్పటికి ఒక్కటి కావు. ఈ రెంటిని వేర్వేరుగా ఉంచాల్సిందేనని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో మత సెంటిమెంట్‌ను పులమడం సరైంది కాదని కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మోదీకి సూచించారు.

ప్రధానమంత్రిది డ్రామా..(Mallikarjun Kharge)

ప్రధానమంత్రి డ్రామాకు తెరతీయడానికి కన్యాకుమారికి వెళ్లారు. ఆయన పర్యటనకు దేశం డబ్బు ఎంతో వృధా అవుతోంది.. ఆయన కోసం ఎంత మంది పోలీసు అధికారులను నియమించాలి అని నిలదీశారు. మీ డ్రామాల వల్ల దేశానికి మేలు కంటే కీడే ఎక్కువన్నారు ఖర్గే. కాగా ప్రధానమంత్రి మోదీ కన్యాకుమారిలోని ధ్యానమంటపంలో ధ్యానం చేస్తున్నారు. ఇక్కడే స్వామి వివేకానంద కూడా ధ్యానం చేసి దైవ శక్తిని పొందారని నమ్ముతారు. కాగా ప్రధానమంత్రి మోదీ కూడ శనివారం వరకు ఇక్కడే ధ్యానం చేస్తారు. కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటారు.

ఇక ఫలితాల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కొన్ని సీట్లు రావచ్చు.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయన్న నమ్మకంతో ఖర్గే ఉన్నారు. ప్రధానమంత్రి ఎన్ని గొప్పులు చెప్పుకొన్నా దేశ ప్రజలు మాత్రం ఆయనను ఒడించాలని నిర్ణయించుకున్నారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ భ్రష్టు పట్టించిందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని ఖర్గే అన్నారు.

మీరు గాడ్సేని ప్రేమిస్తారు..

మహాత్మాగాంధీ గురించి మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఖర్గే మండిపడ్డారు. 1982లో గాంధీ సినిమా విడుదలైన తర్వాతనే గాంధీ ఎవరనే విషయం ప్రపంచానికి తెలిసిందన్నారు మోదీ. గుజరాత్‌కు చెందిన వ్యక్తి ఇలా మాట్లాడితే మనం చేయగలిగింది కూడా ఏమీలేదన్నారు ఖర్గే. జాతి పిత గాంధీని .. గుజరాతి అయిన మీరు ఆయనకు ఎందుకు ప్రచారం చేయడం లేదని నిలదీశారు. తాము గాంధీని గౌరవిస్తాం.. మరి మీరు గాడ్సేను ప్రేమిస్తారని ఖర్గే చురకలంటించారు.

ఇవి కూడా చదవండి: