Last Updated:

CEC Rajiv kumar: భారతీయ ఎన్నికలు ఓ అద్భుతం.. సీఈసీ రాజీవ్ కుమార్

CEC Rajiv kumar: భారతీయ ఎన్నికలు ఓ అద్భుతమని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌కుమార్‌ సోమవారం నాడు అన్నారు. మంగళవారం నాడు కౌంటింగ్‌ జరుగనున్న నేపథ్యంలో ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 642 మిలియన్‌ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఓ చారిత్రక రికార్డు అని ఆయన అన్నారు.

CEC Rajiv kumar: భారతీయ ఎన్నికలు ఓ అద్భుతం.. సీఈసీ రాజీవ్ కుమార్

CEC Rajiv kumar: భారతీయ ఎన్నికలు ఓ అద్భుతమని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌కుమార్‌ సోమవారం నాడు అన్నారు. మంగళవారం నాడు కౌంటింగ్‌ జరుగనున్న నేపథ్యంలో ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 642 మిలియన్‌ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఓ చారిత్రక రికార్డు అని ఆయన అన్నారు.

ప్రపంచదేశాలతో పోల్చితే..(CEC Rajiv kumar)

జీ7 దేశాలతో పోల్చుకుంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యూరోపియన్‌ దేశాలతో పోల్చుకుంటే 2.5 రెట్లు ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్న ప్రతిఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు కుమార్‌. ప్రపంచంలో ఇండియాకు ఏ దేశం సాటిరాదన్నారు. 2024 లోకసభ ఎన్నికల్లో 312 మిలియన్‌ మహిళా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. 27ఈయు దేశాల్లో చివరగా జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే 1.25 రెట్లు ఎక్కువ. 85 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసు కలిగిన వారు ఓటు హక్కును వినియోగించుకొని యువతకు ఆదర్శంగా నిలిచారు. మన ప్రజాస్వామ్యానికి వారు హీరోలు. స్వాతంత్ర్యం రాక ముందు వచ్చిన తర్వాత నుంచి గత 70 ఏళ్ల నుంచి భారత ప్రజాస్వామ్యం ఎలా రూపాంతరం చెందిందనడానికి వారే ప్రబల సాక్ష్యం అని సీఈసీ అన్నారు. ప్రణాళికబద్ధంగా ఒక వ్యూహం ప్రకారం ఎన్నికలు నిర్వహించినందున ఈ సారి ఎన్నికల్లో కేవలం 39 చోట్ల రీపోలింగ్‌లు జరిగాయి. అదే 2019లో చూస్తే 540 కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిగిందన్నారు.

జమ్ము కశ్మీర్‌ ప్రజలకు ఈసీ ప్రత్యేక ధన్యవావాలు తెలిపింది. గత నాలుగు దశాబ్దాల నుంచి చూస్తే ఈసారి అత్యధికంగా పోలింగ్‌ జరిగిందన్నారు రాజీవ్‌కుమార్‌. 23 దేశాలకు చెందిన 75 మంది పరిశీలకులు ఎన్నికల ప్రక్రియను దగ్గరుండి గమనించారు. ఇవన్నా ఒక ఎత్తయితే ఎన్నికలు స్వేచ్చపారదర్శంగా జరిగాయన్నారు.ఎక్కడ పెద్ద హింస చెలరేగలేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో రూ.10,000 కోట్లు జప్తు చేశామని.. 2019తో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువన్నారు కుమార్‌. మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్‌కుమార్‌తో పాటు ఈసీ జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూలు కూడా మాట్లాడారు.

శనివారం నాడు జరిగిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్నీ ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. కాగా దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూడా బీజేపీ మెరుగైన సీట్లు దక్కించుకోనుంది. బీజేపీ- ఎన్‌డీఏ కలిసి 400 సీట్లు దక్కించునే అవకాశాలు కూడా కనిస్తున్నాయి.  కాగా దేశంలో లోకసభ ఎన్నికలు ఏడు విడతల్లో ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు జరిగాయి. కాగా ఓట్ల లెక్కింపు జనవరి 4. మంగళవారం జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి: