Home / Latest National nerws
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదం అవసరం లేదని, పార్టీ మైనారిటీ విభాగాన్ని తొలగించాలని అన్నారు.
జమ్ము కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక అధికారితో సహా నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన దళాలు మరియు జమ్ము అండ్ కశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జాయింట్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్కౌంటర్ ప్రారంభమయింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్‌లను రాష్ట్రపతి నియమించారు. వీరి నియామకంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 కు చేరింది.
గుజరాత్ లో చండీపురా వైరస్‌తో ఆరుగురు చిన్నారులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. రాష్ట్రంలో ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదయ్యాయన్నారు.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం మొదట జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో లీక్ అయిందని తరువాత బీహార్ వెళ్లిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) తెలిపింది. బీహార్‌లో మొదట ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మొదట భావించారు. పేపర్ లీక్ కు సంబంధించి పలువురిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) ప్రాంతీయ బెంచ్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి పురుషుడిగా మారారు.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిఫారసు మేరకు యూపీ ప్రభుత్వం ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం), తహసీల్దార్, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ మరియు ఇద్దరు పోలీసు అవుట్‌పోస్టు ఇన్ చార్జిలు ఉన్నారు.
ఉత్తరాఖండ్ రిషికేశ్ లోని గంగా ఘాట్ల వద్ద విదేశీ మహిళలు బికినీలు ధరించి ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పవిత్ర గంగా నదిలో స్విమ్సూట్లతో వారు ఆడుతున్న దృశ్యాలను చూపే ఫుటేజీకి వీక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
:బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ ను శుక్రవారం, చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా అతన్ని దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు.హత్రాస్ పర్యటనకు ముందు అలీఘర్‌లోని పిలాఖ్నా గ్రామంలో ఆగి, అక్కడ కూడా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.