Pune Minor Car Accident: పూనే మైనర్ కారు ప్రమాదానికి రాజకీయరంగు
ఇటీవల పూనేలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు మద్యం మత్తులో తన ఖరీదైన పోర్ష్ కారుతో మోటార్ సైకిల్‌పై వెళ్తున్నఓ జంటను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారకుడయ్యాడు. అప్పటి నుంచి ఈ అంశం కాస్తా జాతీయ పతాక శీర్షికను ఆకర్షిస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది.
Pune Minor Car Accident: ఇటీవల పూనేలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు మద్యం మత్తులో తన ఖరీదైన పోర్ష్ కారుతో మోటార్ సైకిల్‌పై వెళ్తున్నఓ జంటను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారకుడయ్యాడు. అప్పటి నుంచి ఈ అంశం కాస్తా జాతీయ పతాక శీర్షికను ఆకర్షిస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది.
రోడ్డు ప్రమాదానికి కారకుడైన బాలుడి తండ్రి పూనేలో అత్యంత సంపన్నుడు. రియల్ ఎస్టేట్ డెవలపర్.. అధికారపార్టీతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నవాడు. మహారాష్ర్ట డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడని జాతీయ మీడియా కోడై కోస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత పూనే పోలీసు కమిషనర్‌తో అజిత్ పవార్ స్వయంగా పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే ఎన్‌సీపీ ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌కు వెళ్లి మైనర్ బాలుడిని విడిపించేందుకు ప్రయత్నించడాన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డ్రైవర్ ను ఇరికించాలని..( Pune Minor Car Accident)
ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన రోజు కారులో ప్రయాణిస్తున్న మైనర్ బాలుడి మిత్రులు కూడా పోలీసులకు సాక్ష్యం ఇచ్చారు. మద్యం మత్తులో మైనర్ కారు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాగా రియల్ ఎస్టేట్ డెవలపర్ అగర్వాల్ కుటుంబం డ్రైవర్ ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీటులో ఉన్నాడని మైనర్ మిత్రులు పోలీసులకు తెలిపారు. ఇదే విషయాన్ని పూనే పోలీసు కమిషనర్ అమితేష్‌కుమార్ కూడా మీడియా సమావేశంలో ఖరారు చేశారు. కాగా అగర్వాల్ కుటుంబం డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించాలని విశ్వప్రయత్నం చేసింది.కాగా డ్రైవర్ గంగారాం ముందుగా పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ప్రమాదం జరిగినప్పుడు తానే కారు నడిపానని ఒప్పుకున్నాడు. మైనర్ తాత సురేంద్ర అగర్వాల్ డ్రైవర్‌ను అతని కుటుంబాన్ని బెదరించడంతో భయపడి స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే మైనర్ మిత్రులు ఇచ్చిన స్టేట్‌మెంట్ తర్వాత పోలీసులు మైనర్‌ను దోషి తేల్చారు. అదే సమయంలో మైనర్ తాత సురేంద్ర అగర్వాల్‌తో పాటు తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 31 వరకు వారు పోలీసు అదుపులో ఉండాల్సిందే. ఇక రక్తపు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లకు రూ.3 లక్షలు లంచం తీసుకొని సాక్ష్యాలు తారుమారు చేసిన విషయం తెలిసిందే. కాగా డాక్టర్లను కూడా సాక్ష్యలు తారుమారు చేసినందుకు పోలీసులు అరెస్టు చేశారు.
కేసును సీబీఐకి అప్పగించాలి..
ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం ఈ రోడ్‌ర్యాష్ కేసు కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ర్ట కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే ఈ రోడ్డు ప్రమాదం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పూనే రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉందని ఆరోపించారు. కాగా ఆ ఎమ్మెల్యే తన పలుకుబడిని వినియోగించి కేసును నీరగార్చేయత్నం చేశాడని పటోలే ఆరోపించారు. ఇక ఈ ప్రమాదం జరిగిన కేవలం 15 గంటల్లోనే జువెనైల్ జస్టిస్ బోర్డు (జెజెబీ) మైనర్‌కు బెయిల్ మంజూరు చేసింది. అలాగే టీనేజర్‌ను రోడ్ సెప్టీ గురించి వ్యాసం రాయాల్సింది కండిషన్ పెట్టింది. ఉదారంగా బెయిల్ మంజూరు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జెజెబీ మైనర్ నిందితుడిని జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోంకు తరలించింది.