Home / Latest National nerws
అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతీయ జనతాపార్టీ సీతమ్మకు దేవాలయం కట్టి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం లోకసభ ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. ఐదవ విడత ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్‌లో పర్యటిస్తున్నారు.
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఒక వైపు ఎన్నికలు మరో వైపు ఎండలు రాజకీయ నాయకులను ఉక్కరిబిక్కిర చేస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. శనివారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్సియస్ నమోదు అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఈ - మెయిల్ రావడంతో పెద్ద కలకలం ఏర్పడింది. విమానంలోని లావెట్రీలో ఓ టిష్యూ పేపరుపై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న పేపర్ లభించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీ లోని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. మరో ఆరు రోజులపాటు అంటే మే 20 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.
మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు లో చుక్కెదురైంది . 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి సంబందించిన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది .
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ వేశారు . వారణాసి నుంచి లోక్ సభ కు మోడీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే . మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు సైతం హాజరయ్యారు .