Home / Andhrapradesh
Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరుగగా, ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు కారు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ (56), భార్య వాణి(45) మృతిచెందారు. కుమారుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో […]
AP Capital : ఇక నుంచి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు అమరావతి అభివృద్ధికి రూ.11వేల కోట్లు ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం-హడ్కో మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. రుణానికి సంబంధించిన తాజాగా సీఆర్డీఏతో హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కుల్ కృష్ణ ఒప్పంద పత్రాలపై మంత్రి నారాయణ సంతకాలు చేశారు. ఇవాళ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణతోపాటు సీఆర్డీఏ అధికారులను […]
Tenth Exams : ఏపీలో రేపటి (సోమవారం) నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 17న ప్రారంభమై వచ్చే నెల 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,49,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు […]
CM Chandrababu : పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొని మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. త్యాగాలు తెలిసేలా.. మొన్న ఆత్మార్పణ దినోత్సవాన్ని పెద్దఎత్తున జరుపుకున్నామని సీఎం గుర్తుచేశారు. కర్నూలుతో ప్రారంభమైన తెలుగు […]
Vijayasai Reddy : సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యామిలీకి మరో బిగ్ షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కట్టడాలు నిర్మించింది. దీంతో జీవీఎంసీ అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలపై పెద్ద పెద్ద గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ […]
Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓవర్టేక్ చేసే క్రమంలో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామస్తులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
Guntur : గుంటూరు మేయర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన పలు కారణాలు వెల్లడిస్తూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. మేయర్‌కు ఉండాల్సిన ప్రోటోకాల్ కూడా తొలగించారని, స్టాండింగ్ కమిటీ సమావేశంపై సమాచారం ఇవ్వలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అవమానాలు ఎప్పుడూ తనకు జరగలేదని, ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. తన అనుమతి లేకుండా స్టాండింగ్ […]
Pawan kalyan : ఒక భాషను బలవంతంగా రుద్దడం.. వ్యతిరేకించడం సరికాదని జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో రెండు అంశాలు దోహదపడవని చెప్పారు. ఈ మేరకు పవన్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, దాన్ని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. ఎన్ఈపీ-2020 స్వయంగా హిందీని అమలు చేయలేదని పేర్కొన్నారు. హిందీ భాష అమలు […]
Srisailam Temple : శ్రీశైలం మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి రోజూ వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తారు. కాగా, ఆలయంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. కొంతమంది కేటుగాళ్లు దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆలయంలో వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే భక్తులను మోసం […]
CM Chandrababu : ఏపీని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం ముందుకెళ్తున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విమానంలో వస్తే చెట్లను […]