Home / Andhrapradesh
AP cabinet : ఏపీలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. […]
Chandrababu : 2047 ఏడాది నాటికి మన దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇవాళ శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ -2047 డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. 2047 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. అప్పటి వరకు 2.4 ట్రిలియన్ల ఆర్థిక […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యిందని సభ్యులు అన్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న […]
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో తిరుమల శ్రీవారి దర్శనాలు కల్పించడంపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెంకన్న దర్శనం ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం, మంగళవారం, రూ.300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాల్లో మాత్రమే స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఒక్కో […]
Cabinet Meeting : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు (సోమవారం) కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులుకు మంత్రివర్గం ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన 10 సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ […]
Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరుగగా, ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు కారు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ (56), భార్య వాణి(45) మృతిచెందారు. కుమారుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో […]
AP Capital : ఇక నుంచి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు అమరావతి అభివృద్ధికి రూ.11వేల కోట్లు ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం-హడ్కో మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. రుణానికి సంబంధించిన తాజాగా సీఆర్డీఏతో హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కుల్ కృష్ణ ఒప్పంద పత్రాలపై మంత్రి నారాయణ సంతకాలు చేశారు. ఇవాళ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణతోపాటు సీఆర్డీఏ అధికారులను […]
Tenth Exams : ఏపీలో రేపటి (సోమవారం) నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 17న ప్రారంభమై వచ్చే నెల 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,49,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు […]
CM Chandrababu : పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొని మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. త్యాగాలు తెలిసేలా.. మొన్న ఆత్మార్పణ దినోత్సవాన్ని పెద్దఎత్తున జరుపుకున్నామని సీఎం గుర్తుచేశారు. కర్నూలుతో ప్రారంభమైన తెలుగు […]
Vijayasai Reddy : సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యామిలీకి మరో బిగ్ షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కట్టడాలు నిర్మించింది. దీంతో జీవీఎంసీ అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలపై పెద్ద పెద్ద గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ […]