Home / Andhrapradesh
Vijaysai Reddy : వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని, కోటరీ వల్లే ఆయనకు దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసిన తర్వాతే తన మనసు విరిగిపోయిందని చెప్పారు. అందుకే వైసీపీ పార్టీ నుంచి వెళ్తున్నట్లు జగన్కు చెప్పినట్లు పేర్కొన్నారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్ ఉంటుందన్నారు. జగన్ చుట్టూ కొందరు నేతలు […]
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్కు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో విజయసాయిరెడ్డిపై 506, 384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 12న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో వారు పేర్కొన్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు […]
Kurnool High Court : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ వాసుల కలను నెరవేర్చేందుకు 2014-19లో టీడీపీ అడుగులు వేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం స్థానిక ప్రాంతాలను పరిశీలించింది. కానీ, ఎన్నికలు రావడంతో టీడీపీ ఓటమి చవిచూసింది. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కర్నూలును మూడో రాజధాని చేస్తామని ప్రకటించింది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని హామీని కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రాంతాన్ని […]
MLC Nomination : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు, బీజేపీ నుంచి ఒక అభ్యర్థి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, బీజేపీ తరఫున సోము వీర్రాజు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ […]
Garimella Balakrishna : టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసిన ఆయన ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు లాంటి కీర్తనలకు స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ గరిమెళ్ల ప్రసిద్ధులు. శుక్రవార యాదగిరిగుట్టలో గరిమెళ్ల తన ప్రదర్శనతో […]
Sajjala Ramakrishna Reddy : ఈ నెల 12న యువత పోరుతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా యవకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు. దీంతో లక్షలాది […]
MLC Candidates : ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. నామిషన్లకు రేపే చివరి రోజు కావడంతో ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రంలోగా ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. సభలో ఉన్న సభ్యుల ఆధారంగా పోటీ చేసిన అభ్యర్థులకు విజయం దక్కుతుంది. అసెంబ్లీలో దాదాపు […]
Perni Nani : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి డైవర్షన్ పాలిటిక్స్ అని మాజీ మంత్రి, వైసీసీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ చేయడానికి తప్పుడు విచారణలు చేయిస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి మాట్లాడారని, కానీ వాచ్మెన్ రంగన్న మృతిపై రాజకీయాలు సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. […]