Home / Andhrapradesh
Shock for YCP in Kadapa : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇవాళ ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్ జగన్‌తో మాట్లాడించాలని మూడునెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోవడం లేదని చంద్ర తెలిపారు. అనుచరుల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకంటున్నట్లు చెప్పారు. ఆయన […]
Minister Nara Lokesh : మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కడపలో నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో భేటీ అయ్యారు. మహానాడు ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక […]
AP CM Chandrababu : ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది ఇండియాలోనే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో టెక్ ఏఐ కాంక్లేవ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ రహదారుల అభివృద్ధి.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. […]
Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. వంశీ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో రెండుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం రెండుసార్లు బెయిల్ తిరస్కరించింది. దీంతో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇటీవల ఇరువర్గాల తరఫు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. […]
TTD : తిరుమలలో ఈ నెల 15 నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాణరెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై గురువారం నుంచి బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫారసు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు గతంలో టీటీడీ ప్రకటించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని తెలిపింది. […]
YSRCP President and former CM YS Jagan : వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ తరఫున రూ.25లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం జగన్ గోరంట్ల మండలం కల్లితండాలో మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మురళి త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. జవాను చనిపోతే రూ.50లక్షలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం […]
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో అతడిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గోవిందప్ప భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరక్టర్‌గా ఉన్నారు. సిట్ అధికారులు నోటీసులు.. లిక్కర్ స్కార్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ గోవిందప్పతోపాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి మూడు […]
Sajjala Ramakrishna Reddy Comments: ఏపీలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీలో పోలీసులు పరిధి దాటుతున్నారని మండిపడ్డారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల […]
AP Speaker Ayyanna Patrudu Donate 1 month salary to Indian Army: ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్మీకి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. సైనికులకు తమ వంతు సాయం చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం ఆర్మీకి విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల జీతం జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా విరాళాన్ని అందజేశారు. […]
Flight services from AP to Abu Dhabi : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రవ్యాపంగా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖ-అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి […]