Last Updated:

FIFA: ఫిపా ప్రపంచ కప్ లో సౌదీ సంచలనం.. దేశవ్యాప్తంగా సెలవు ప్రకటన

ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్-3 జట్టు అయిన అర్జెంటీనాను ఆసియా పసికూన అయిన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. అంతేకాకుండా వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి టైటిల్‌ ఫేవరేట్‌గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన మెస్సీ సేన దూకుడుకు సౌదీ అడ్డుకట్ట వేసింది.

FIFA: ఫిపా ప్రపంచ కప్ లో సౌదీ సంచలనం.. దేశవ్యాప్తంగా సెలవు ప్రకటన

FIFA: ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్-3 జట్టు అయిన అర్జెంటీనాను ఆసియా పసికూన అయిన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. అంతేకాకుండా వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి టైటిల్‌ ఫేవరేట్‌గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన మెస్సీ సేన దూకుడుకు సౌదీ అడ్డుకట్ట వేసింది.

గ్రూప్-సిలో భాగంగా జరిగిన మ్యాచ్ లో తనకన్నా ఎన్నో రెట్లు బలమైన అర్జెంటీనా జట్టు సౌదీ అరేబియా మ్యాచ్ అనగానే అసలు పోటీనైనా ఇవ్వగలదా అని చాలా మంది భావించారు. అలాంటి అంచనాలన్నింటిని బద్దలు కొడుతూ మెస్సీ సేనను సౌదీ టీం 2-1 తేడాతో చిత్తుచేసింది. ప్రత్యర్థి జట్టులో లయొనెల్ మెస్సీ వంటి దిగ్గజ స్ట్రయికర్ ఉన్నప్పటికీ సౌదీ ఆటగాళ్లు వెనక్కి తగ్గకుండా తమ శక్తికి మించిన ప్రదర్శన చేశారు. దాంతో సౌదీ చేతిలో మెస్సీ సేనకు భంగపాటు తప్పలేదు.

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో సౌదీ ఈ మ్యాచ్ తో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకోసుకుంది. దానితో ఆదేశ రాజు సాల్మన్‌ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సౌదీ గెలుపుకు చిహ్నంగా దేశవ్యాప్తంగా బుధవారం సెలవుదినంగా ప్రకటించారు. జాతీయ జట్టు చిరస్మరణీయ విజయాన్ని ఆస్వాదించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు తోడు విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనితో సౌదీ వీధుల్లో తమ జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ ప్రజలు సందడి చేస్తున్నారు.

ఇదీ చదవండి: క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా ప్రభుత్వం షాక్

ఇవి కూడా చదవండి: