Home / Saudi Arabia
ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ముస్లింలు ఈద్ -అల్ అదా .. లేదా బక్రీద్ జరుపుకున్నారు. అయితే ఈద్‌ను పురస్కరించుకుని ముస్లింలు సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలం మక్కాను దర్శించుకున్నారు.
సౌదీ అరేబియా ప్రభుత్వం రాజధాని రియాద్‌లో ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తలకు సేవలందించే మొట్టమొదటి ఆల్కహాల్ దుకాణాన్ని తెరవడానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యం తాగిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి.
పాకిస్థాన్ భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అదేవిధంగా పాక్ చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంది. ఇపుడు తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలో బిచ్చగాళ్లు చేరారు. అవును.. సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాలు ఇప్పుడు బిచ్చగాళ్ల ప్రవాహాన్ని అరికట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
సౌదీ అరేబియాలో బస్సు వంతెనను ఢీకొని బోల్తాపడి మంటలు చెలరేగడంతో 20 మంది ఉమ్రా యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో 29 మంది గాయపడ్డారు. బస్సుబ్రేకులు ఫెయిల్ కావడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం.
సౌదీ అరేబియా యొక్క ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల రంజాన్ మాసంలో దాని పౌరులు అనుసరించాల్సిన కొత్త నిబంధనలను నిర్దేశించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సౌదీ అరేబియా త్వరలో దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో యోగాను ప్రవేశపెట్టనుంది. సౌదీ యోగా కమిటీ (SYC) అధ్యక్షుడు నౌఫ్ అల్-మార్వాయ్ చెప్పిన దాని ప్రకారం యోగాకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేయబడతాయి.
సౌదీ అరేబియా ఈ ఏడాది చివర్లో అంతరిక్ష యాత్రకు తొలిసారిగా మహిళా వ్యోమగామిని పంపనుంది.
పోర్చుగల్ ఫుట్ బాల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా యొక్క అల్ నాసర్ క్లబ్ తో రెండున్నర సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసాడు.
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫోర్డ్ నుండి నిష్క్రమించిన తర్వాత సౌదీ అరేబియాకు చెందిన అల్-నాసర్లో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం.
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్-3 జట్టు అయిన అర్జెంటీనాను ఆసియా పసికూన అయిన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. అంతేకాకుండా వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి టైటిల్ ఫేవరేట్‌గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన మెస్సీ సేన దూకుడుకు సౌదీ అడ్డుకట్ట వేసింది.