Last Updated:

Yuvaraj Singh: క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా ప్రభుత్వం షాక్

మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌కు గోవా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గోవా ప‌ర్యాట‌క శాఖ యువీకి నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లాకు రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే యువీ వాడుకుంటున్న‌ట్లు ఫిర్యాదు న‌మోదు చేసింది.

Yuvaraj Singh: క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా ప్రభుత్వం షాక్

Yuvaraj Singh: మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌కు గోవా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గోవా ప‌ర్యాట‌క శాఖ యువీకి నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లాకు రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే యువీ వాడుకుంటున్న‌ట్లు ఫిర్యాదు న‌మోదు చేసింది. ఈ కేసులో డిసెంబ‌ర్ 8వ తేదీన యువరాజ్ విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది.

నార్త్ గోవాలో ఉన్న ఓ విల్లాను హోమ్‌స్టేగా వాడుతున్నారు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కాగా ఆ విల్లాకు గోవా ప‌ర్యాట‌క శాఖ నుంచి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. అయితే దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే కాసా సింగ్ అని ఆ విల్లాకు యువీ పేరు పెట్టుకుని ఉపయోగిస్తున్నారు. కాగా తను అలా ఆ విల్లాను వాడడం వల్ల న‌వంబ‌ర్ 18న యువీకి నోటీసులు ఇచ్చారు. ప్రాప‌ర్టీని రిజిస్ట‌ర్ చేసుకోలేదు కాబట్టి, ల‌క్ష‌రూపాయ‌లు జ‌రిమానా క‌ట్టాల‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎయిర్‌బీఎన్బీ లాంటి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో యువీ త‌న విల్లాను హోమ్‌స్టేగా చూపిస్తున్నాడ‌ని, అలాంట‌ప్పుడు ఆ బిల్డింగ్‌ను ఎందుకు రిజిస్టర్ చేసుకోవ‌డం లేద‌ని గోవా ప‌ర్యాట‌క శాఖ ప్ర‌శ్నించింది. దీనిపై డిసెంబ‌ర్ 8వ తేదీ లోపు యువరాజ్ సింగ్ వివ‌ర‌ణ ఇవ్వ‌కుంటే, జ‌రిమానా విధించ‌డం ఖాయ‌మ‌ని గోవా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

ఇదీ చదవండి: ప్రపంచ రికార్డులను తిరగరాశాడు.. ఒక్కడే నిలబడి 277 కొట్టాడు

ఇవి కూడా చదవండి: