Published On:

BJP MLA: చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే.. వందేభారత్‌ రైల్లో ప్రయాణికుడిపై దాడి!

BJP MLA: చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే.. వందేభారత్‌ రైల్లో ప్రయాణికుడిపై దాడి!

BJP MLA followers attacked on Passengers in Vande Bharat Train: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందేభార‌త్ రైల్లో ఓ ప్రయాణికుడిని ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు చిత‌క‌బాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. ఎమ్మెల్యే ఎదుట అతడి అనుచరులు ప్రయాణికుడిపై దాడిచేశారు. ఘటనపై బీజేపీ అధిష్ఠానం స్పందించింది. ఈ మేరకు ఎమ్మెల్యేకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్‌ నారాయణ్‌ శుక్లా షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

 

ఎమ్మెల్యే రాజీవ్‌సింగ్ ఇటీవల త‌న భార్య, కుమారుడితో క‌లిసి వందేభార‌త్ రైలు ఎక్కారు. ఓ బోగీలో ఎమ్మెల్యేకు ఒక చోట, త‌న కుటుంబానికి మ‌రో చోటు సీటు దొరికింది. కుటుంబ‌ స‌భ్యులు కూర్చున్న చోట వేరే ప్రయాణికుడు కూర్చుకున్నాడు. అతను సీటు మారేందుకు నిరాక‌రించాడు. దీంతో ఎమ్మెల్యే కుటుంబానికి, ప్రయాణికుడికి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ క్రమంలోనే రైలు ఝాన్సీ రైల్వే స్టేష‌‌న్‌కు చేరుకున్న త‌ర్వాత ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు వ‌చ్చి ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో అత‌డి శ‌రీరం, దుస్తులు మొత్తం ర‌క్తంతో నిండిపోయాయి. ఘ‌ట‌న‌పై ఝాన్సీ ఎస్పీ విపుల్ కుమార్ శ్రీవాత్సవ్ కేసు బుక్ చేసి విచార‌ణ మొదలుపెట్టారు.

 

 

ఇవి కూడా చదవండి: