Double Dhamaka in IPL 2025: నేడు రెండు మ్యాచ్‌లు.. కోల్‌కతా వర్సెస్ లక్నో, పంజాబ్ వర్సెస్ చెన్నై మధ్య హోరాహోరీ!

Double Dhamaka in Today IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
ఇప్పటికే లక్నో, కోల్‌కతా జట్లు రెండు వరుసగా విజయాలు నమోదవ్వగా.. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ హోరాహూరీగా ఉండే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో కోల్‌కతా 5వ స్థానంలో ఉండగా.. లక్నో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ గెలుస్తుందా అనే ఆసక్తి నెలకొంది. పంజాబ్.. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలవగా.. ఒకటి ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో ఉండగా.. చెన్నై 9వ స్థానంలో కొనసాగుతోంది.