Published On:

Health Tips: అరటిపండుతో గుండె పదిలం, రక్తపోటుకు ఎంతో మేలు చేస్తుంది

Health Tips: అరటిపండుతో గుండె పదిలం, రక్తపోటుకు ఎంతో మేలు చేస్తుంది

Health: అరటిపండుతో లాభాలెన్నో. అన్నికాలాల్లో దొరికే అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో గుండెకు సంబంధించిన రోగాలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. హైబీపీ కంట్రోల్ లో ఉంటుందంటున్నారు. అరటిపండులో 450 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ప్రతీరోజు అరటిపండును తినడం వలన రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు.

 

ప్రస్తుత జీవన శైలిలో ఇంట్లో భోజనం కంటే భయటి భోజనాన్నే తింటున్నారు. ఉద్యోగరిత్యా, చదువులరిత్యా ఎంతో మంది భయట హోటల్స్ లోనే భోజనాన్ని తీసుకుంటున్నారు. అయితే అందులో ఉప్పు శాతం సరిగ్గా ఉండకపోవడం వలన శరీరంలోని పొటాషియం శాతం అదుపుతప్పుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అరటి పండును తీసుకోవడం వలన పొటాషియం మూత్రపిండాల ద్వారా పేరుకుపోయిన సోడియాన్ని బయటకు పంపిస్తుంది. దీంతో హైబీపీ అదుపులోకి వస్తుంది. కాబట్టి ప్రతీరోజు రెండు అరటి పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం.

 

 health tips with banana telugu

health tips with banana telugu

అరటిపండ్లలో ఉండే అతి మరో ముఖ్యమైనది మెగ్నీషియం. ఇది హైబీపీని కంట్రోల్ చేసేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. రక్తనాళాల గోడల్లోని మంటను తగ్గించి, నరాల పనితీరును సరిచేస్తుంది. మెగ్నీషియంలోపమే అధికరక్తపోటుకు కారణం. అరటిపండ్లను జ్యూస్ గా చేసుకుని తాగినా ఎంతో మేలు ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బీపీని కంట్రోల్ లో ఉంచి గుండెను కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి జీర్ణక్రియను బ్యాలెన్స్ చేస్తుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తో పాటు అరటి పండును తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

women health with banana

women health with banana

 

ప్రతీ రోజు రెండు అరటిపండ్లను సునాయాసంగా తినేయొచ్చు. వీటిని పిల్లలకు కూడా ప్రిఫర్ చేయవచ్చు. అరటిపండ్లలో కాయలుగా ఉన్నవి కాకుండా పొట్టుపై చిన్నపాటి నల్ల మచ్చలు అప్పుడే ఏర్పడినవైతే అధికలాభం ఉంటుందట. రుచిగా కూడా మంది మధురాన్ని ఇస్తాయి. అరటి పళ్లలో చెక్కెర సహజంగానే ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డాక్లర్లు ఏదైనా ఇతర కారణాల వలన అరటిపండ్లను కొన్ని రోజులు తినవద్దు అని చెబితే కాని వాటికి దూరంగా ఉండకండి.

 

 

గమనిక: అరటిపండ్ల గురించిన వివరాలు సాధారణమైనవే మేము ఇక్కడ ప్రస్తావించాము. అన్ని ఆహార పదార్థాలు తీసుకుంటూ అరటిపండ్లను వాటితో పాటు తింటే కలిగే లాభాన్ని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇది ఏవిధమైన చికిత్సకు సంబంధించింది కాదు. కాబట్టి మీరు తీసుకునే రోజువారి ఆహారంతో పాటు అరటిపండును అందులో చేర్చవచ్చు. మరింత అవగాహన కోసం మీ వైద్యుడిని సంప్రదించి అరటిపండ్లు తినే విషయంపై నిర్ణయానికి రండి. ప్రైమ్ 9 న్యూస్ చానల్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. కేవలం విషయాన్ని మాత్రమే చేరువ చేస్తోంది. ఖచ్చితత్వమైన రిజల్ట్స్ కు చానల్ బాధ్యత వహించదు.