Published On:

Personal Loan Application: పర్సనల్ లోన్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం వలన 5 ప్రయోజనాలు

Personal Loan Application: పర్సనల్ లోన్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం వలన 5 ప్రయోజనాలు

Benefits of applying Personal Loan by Online: జీవితానికి ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఏవైనా అత్యవసర పరిస్థితులు మన చేతిలో ఉండవు కాబట్టి ఆర్థికంగా స్థిరంగా ఉండాలి. కానీ, అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చడానికి మీ వద్ద తగినంత పొదుపు లేకపోతే పర్సనల్ లోన్ తీసుకోవడం తప్పనిసరైంది. ఇందులకు బ్యాంకుకు అప్లై చేసుకోవాలి. హాస్పిటల్ బిల్లులు చెల్లించాలన్నా, ఉన్నత చదువులు కవర్ చేయాలన్నా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.

 

పర్సనల్ లోన్ ను బ్యాంకుకు వెళ్లి అప్లై చేసుకోవడం కంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం వలన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.

 

ఎప్పుడైనా ఆన్ లైన్ లో అప్లై చేసుకొవచ్చు…

పర్సనల్ లోన్ కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడం వలన ఎక్కువ సార్లు బ్యాంకుకు వెళ్లవలసిన, లైన్లో నిలపడవలసిన అవసరం లేదు. ఫాం నింపడం అప్ లోడ్ చేయడం వంటి పనులు ఆన్లైన్ లో సులువుగా అవుతాయి.

 

తొందరగా ఆమోదం పొందుతుంది…

ఆన్ లైన్ దరఖాస్తులు సాధారణంగా వేగవంతంగా పూర్తవుతాయి. చాలా బ్యాంకులు అర్హత కలిగిన వ్యక్తులను ఫిల్టర్ చేసి పెడతాయి. కొన్ని సార్లు 2 గంటలనుంచి 24గంటల లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

 

మినిమం డాక్యుమెంటేషన్…

ఆన్ లైన్ లో అప్లై చేయడం సాంప్రదాయంగా చేసే దరఖాస్తు కంటే తక్కువగా పేపర్ వర్క్ జరుగుతుంది. చాలా బ్యాంకులు ఆన్ లైన్ లో వ్యక్తి గత లోన్ కోసం అప్లై చేయడానికి పాన్, ఆధార్, ఆదాయ రుజువు కోసం 3నెలల బ్యాంక్ స్టేట్ మెంట్, KYC పత్రాలు అవసరం అవుతాయి. ఇవన్నీ ఆన్ లైన్ లో అప్లై చేయవచ్చు.

 

ఆన్ లైన్లో అప్లై చేయడం వలన వ్యక్తిగత రుణాలు ఎంచుకోవడానికి పార్దర్శకంగా ఉంటుంది. రియల్ టైమ్ నోటిఫికేషన్ లు అప్పటికప్పుడు పొందుతారు. ఆన్ లైన్ లో అన్ని అంశాలు అందుబాటులోనే ఉంటాయి కావున అర్హత ఉన్నవారికి లోన్లు పొందడం సులభమవుతుంది.

 

ఇవి కూడా చదవండి: