IPL 2025 : అదరగొట్టిన అయ్యర్.. గుజరాత్ టార్గెట్ 244

IPL 2025 : గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో అదరగొట్టాడు. ప్రియాంక్ ఆర్య 23 బంతుల్లో 47 పరుగులు చేసి అదరగొట్టాడు. 7 ఫోర్లు, 2సిక్స్‌లతో రాణించాడు. చివరిలో శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 6ఫోర్లు, 2 సిక్స్‌లు మెరుపులతో పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 243 చేసింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 3, రషీద్ ఖాన్ రబాడ చెరో వికెట్ తీశారు. ఐపీఎల్‌లో 150 వికెట్లు రషీద్ ఖాన్ తీసి, బౌలర్ల జాబితాలో చేరాడు.