Last Updated:

IPL 2023 : ఐపీఎల్ 2023 లో ఎవరికి ఏ అవార్డు దక్కింది? ఎంత ప్రైజ్ మనీ అందిందంటే ??

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ సీజన్ అత్యంత ఘనంగా ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఈసారి టైటిల్ ని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన క్రమంలో సిక్సర్, ఫోర్ కొట్టి రవీంద్ర జడేజా చెన్నైకి

IPL 2023 : ఐపీఎల్ 2023 లో ఎవరికి ఏ అవార్డు దక్కింది? ఎంత ప్రైజ్ మనీ అందిందంటే ??

IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16 వ సీజన్ అత్యంత ఘనంగా ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఈసారి టైటిల్ ని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన క్రమంలో సిక్సర్, ఫోర్ కొట్టి రవీంద్ర జడేజా చెన్నైకి అద్బుత విజయాన్ని అందించాడు. దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యం లోని చెన్నై అత్యధిక ఐపీఎల్ టైటిళ్లను సాధించిన ముంబై రికార్డుకి సమానం చేసింది.

ఈసారి రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. అత్యధిక సెంచరీలు, హైస్కోరు, ఫైనల్ బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లు.. ఇలా 2023 ఐపీఎల్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత  అవార్డుల కార్యక్రమం కూడా కన్నుల పండువగా జరిగింది. ట్రోఫీతో పాటు సీజన్ మొత్తం  అలరించిన ఆటగాళ్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన వారికి పలు అవార్డులు దక్కాయి.  ఈ క్రమం లోనే ఈ సీజన్ లో ఎవరికి ఏ అవార్డు దక్కింది.. ఎవరెవరికి ఎంత ప్రైజ్ మనీ అందిందో మీకోసం ప్రత్యేకంగా..

IPL 2023 ఛాంపియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్, రూ. 20 కోట్లు + ట్రోఫీ

రన్నరప్ – గుజరాత్ టైటాన్స్, రూ. 13 కోట్లు.

మూడో స్థానం – ముంబై ఇండియన్స్, రూ. 7 కోట్లు.

నాలుగో స్థానం – లక్నో సూపర్ జెయింట్స్, రూ.6.5 కోట్లు.

వ్యక్తిగత అవార్డులు (IPL 2023).. 

ఎమర్జింగ్ ప్లేయర్ – యశస్వి జైస్వాల్, ట్రోఫీ + రూ. 20 లక్షలు.

ఆరెంజ్ క్యాప్ – శుభమాన్ గిల్, ఆరెంజ్ క్యాప్ + రూ. 15 లక్షలు.

పర్పుల్ క్యాప్ – మహ్మద్ షమీ, పర్పుల్ క్యాప్ + రూ. 15 లక్షలు.

అత్యంత విలువైన ఆటగాడు – శుభమాన్ గిల్, ట్రోఫీ + రూ. 12 లక్షలు

గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ – శుభ్‌మన్ గిల్

సీజన్‌లోని అత్యధిక ఫోర్లు – శుభ్‌మన్ గిల్ (85)

సూపర్ స్ట్రైకర్ – గ్లెన్ మాక్స్‌వెల్, ట్రోఫీ + రూ. 10 లక్షలు

ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ – డెవాన్ కాన్వే, ట్రోఫీ + రూ. 1 లక్ష.

అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు – ఫాఫ్ డుప్లెసిస్, ట్రోఫీ + రూ. 12 లక్షలు.

ఫెయిర్‌ ప్లే అవార్డు – ఢిల్లీ క్యాపిటల్స్.

క్యాచ్ ఆఫ్ ది సీజన్ – రషీద్ ఖాన్.

సీజన్ యొక్క ఉత్తమ వేదిక – ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం (50 లక్షలు)