Last Updated:

IPL 2025: నేడు ఐపీఎల్‌లో రెండు కీలక మ్యాచ్‌లు.. తొలి మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్

IPL 2025: నేడు ఐపీఎల్‌లో రెండు కీలక మ్యాచ్‌లు.. తొలి మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్

IPL 2025 Today Two Matches SRH VS RR, MI VS CSK: ఐపీఎల్‌ 2025లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది.

 

ఇక, ఉప్పల్ స్టేడియంలో ఆడిన గత ఆరు మ్యాచ్‌ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబద్ విజయం దుందుభి నెలకొల్పగా.. రాజస్థాన్‌తో తలపడిన గత మూడు మ్యాచ్‌లు సైతం సన్ రైజర్స్ హైదరాబాద్‌దే పైచేయి ఉంది. మరోవైపు, బ్యాటింగ్, బౌలింగ్‌లో సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తోంది.

 

కాగా, వాతావరణం విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ఉరుములుతో కూడిన వర్షం కురిసే అవకాశం 40శాతం వరకు ఉండవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉదయం నుంచి సాయంతరం వరకు 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండనుండగా.. రాత్రి 22 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపింది.