ICC WTC 2025-27: ఐసీసీ కీలక ప్రకటన.. డబ్ల్యూటీసీ షెడ్యూల్ విడుదల
ICC WTC 2025-27 Schedule Announced: డబ్ల్యూటీసీపై ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూటీసీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు 2025-27కు సంబంధించి టెస్ట్ మ్యాచ్ వివరాలను ఐసీసీ పేర్కొంది. ఈ మ్యాచ్‌లు 2025 జూన్ నుంచి ప్రారంభమవుతుండగా.. 2027 ఫిబ్రవరిలో పూర్తి కానున్నాయి. ఇందులో భారత్ మొత్తం 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.ఈ ఏడాది జూన్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమై.. 2027 జూన్‌లో ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.
అయితే, అంతకుముందు 2023-25కు సంబంధించిన షెడ్యూల్‌లో ఫైనల్ మ్యాచ్ జూన్ 11న ముగియనుంది. ఈ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతుండగా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో 2023-25 షెడ్యూల్ పూర్తవుతుంది. కాగా, భారత్ లో 9 మ్యాచ్‌లు, విదేశీ గడ్డపై 9 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్.. ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌లు, శ్రీలంక 2, న్యూజిలాండ్ 2, వెస్టిండీస్ 2, దక్షిణాఫ్రికా 2, ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌లు ఆడనుంది.
కాగా, 2025లో జూన్, ఆగస్టు మధ్యన ఇంగ్లాండ్, భారత్ 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనుండగా.. 2025 అక్టోబర్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య 2 టెస్టు మ్యాచ్‌లు, 2025 నవంబర్, డిసెంబర్ మధ్య దక్షిణాఫ్రికాతో భారత్ 2 టెస్టులు, 2026 ఆగస్టులో శ్రీలంక, భారత్ మధ్య 2 టెస్టు మ్యాచ్‌లు, అదే ఏడాది అక్టోబర్, డిసెంబర్ మధ్యలో న్యూజిలాండ్, భారత్ మధ్య 2 మ్యాచ్‌లు, 2027 జనవరి, ఫిబ్రవరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.