Last Updated:

BCCI: ఐర్లాండ్‌తో కీలక సిరీస్.. భారత్ ఉమెన్స్ క్రికెట్ టీం ప్రకటన

BCCI: ఐర్లాండ్‌తో కీలక సిరీస్.. భారత్ ఉమెన్స్ క్రికెట్ టీం ప్రకటన

BCCI announces India’s ODI squad for three-match series: భారత మహిళల జట్టు మరో సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. ఐర్లాండ్‌ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా 15 మంది సభ్యులతోె కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

తొలి వన్డే మ్యాచ్ జనవరి 10వ తేదీన ఉదయం 11 గంటలకు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా వేదికగా జరుగుతుండగా.. ఇదే వేదికపై మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే జనవరి 12న రెండో వన్డే మ్యాచ్ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుండగా.. చివరి మ్యాచ్ జనవరి 15న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మూడు సిరీస్‌లకు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు రెస్ట్ ఇచ్చారు. దీంతో ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో పాటు మరో స్టార్ పేసర్ రేణుకా సింగ్ సైతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు, ఐర్లాండ్ సైతం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

భారత్: స్మృతి మంధాన(C), దీప్తి శర్మ(VC), హర్లీన్ డియోల్, ప్రతీకా రావల్, జెమీమీ రోడ్రిగ్స్, రిచా ఘోష్(WC) ఉమా ఛెత్రీ(WC),తేజల్ హసబ్నిస్, ప్రియా మిశ్రా, రాఘ్వి బీస్త్, టిటాస్ సధు, తనుజా కాన్వెర్, సయాలి సత్ఘరె, సైమా ఠాకూర్.

ఐర్లాండ్: గాబీ లూయూస్(C), క్రిస్టినా కౌల్టర్, అవా కానింగ్, అలానా డాల్జెల్, సారా ఫోర్బ్స్, జార్జినా డెంప్సే, ఏమీ మగైరె, జొన్నా లాగ్హరన్, ఓర్లా ప్రెండరెగస్ట్, లీహ్ పాల్, ఉనా రేమండ్, రెబెక్కా స్టాకెల్ రెబెక్కా.