IPL 2025 GT Vs RR: నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్!

Gujarat Titans Vs Rajasthan Royals IPL 2025 23rd Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక, పాయింట్ల పట్టికలో గుజరాత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ 7వ స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానం వెళ్లేందుకు గుజరాత్ ఆలోచిస్తుండగా.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన రాజస్థాన్ హ్యాట్రిక్ విన్ నమోదు చేయాలని చూస్తోంది.