Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు 5 సాంకేతాలు

Heart Attack Symptoms: గుండె పోటును ముందే గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చు. కాళ్లల్లో, చేతుల్లో వచ్చే సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. గుండె పోటు అనేది గుండెకు రక్త ప్రవాహం ఎక్కువైనప్పుడు వస్తుంది. దీంతో పాటుగా కొవ్వు పేరుకుపోవడం మరియు కొలెస్ట్రాల్ వంటి వివిధ కారణాల వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనుషులు జబ్బుల వలన మరణించడానికి ప్రధాన కారణాలలో గుండె జబ్బు కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 2019లో 17.9 మిలియన్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణించారని సమాచారం. వీరిలో 85% మంది గుండెపోటు, స్ట్రోక్ కారణంగానే మరణించారు. గుండె సంబంధిత వ్యాదులు రావడానికి ముందే కొన్ని సంకేతాలను గుర్తించవచ్చు.
చేతులకు కాళ్ళుకు చెమటలు పట్టడం..
చేతులకు, కాళ్ళకు తరచూ చెమటలు పడుతుంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వలన ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. దీంతోపాటే గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు, చేతులు, కాళ్ళు వంటి ప్రాంతాల నుండి రక్తం మళ్లించబడుతుంది. దీనివల్ల చేతులు, కాళ్ళు చల్లగా, చెమటతో ఉంటాయి.
చేతులు, కాళ్ళలో వాపు..
రావడాన్ని ‘ఎడెమా’ అని కూడా పిలుస్తారు. ఇది గుండెకు వచ్చే వ్యాధులకు కారణమవుతుందని తెలియజేస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గినప్పుడు, చేతులు మరియు కాళ్ళలో ద్రవాలు పేరుకుపోతాయి. దీంతో పాదాలు, చేతులు ఉబ్బడానికి దారితీస్తుంది.
తిమ్మిరి లేదా జలదరింపు..
ధమనులు మూసుకుపోవడం వల్ల రక్త ప్రవాహం సరిగ్గా జరుగదు. దీంతో చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి వస్తుంది. ఇది ఎప్పుడో ఒకసారి వస్తే పర్లేదు, నిరంతరంగా వస్తుంటే మాత్రం డాక్టర్లను సంప్రదించాలి.
నీలం లేదా ఊదా రంగు..
చేతులు, కాళ్ళు రంగుమారి నీలం లేదా ఊదా రంగులో ఉంటే గుండె జబ్బులు వస్తాయి. రక్తంలో తగినంత ఆక్సిజన్‌ను లేక పోవడం కూడా ఇందుకు కారణం. ఇది ధమనులు మూసుకుపోవడం వల్ల కూడా సంభవించవచ్చు.
ఎడమ చేతికి నొప్పి..
గుండెపోటు వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఎడమ చేయి, భుజం నొప్పికి గురవుతుంది. చేయిలోని నరాలకు గుండెకు ఉన్న సంబంధం వలన గుండెకు వచ్చే ముప్పును ముందుగానే చేయి నరాల్లో కనపడుతుంది.