Published On:

Jasprit Bumrah Drop from Captaincy: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా ఔట్.. శుభ్‌మన్‌ వైపే మొగ్గు

Jasprit Bumrah Drop from Captaincy: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా ఔట్.. శుభ్‌మన్‌ వైపే మొగ్గు

Jasprit Bumrah Likely Drop from the test Captaincy: టెస్ట్‌ క్రికెట్‌కు రోహిత్‌ శర్మ ప్రకటించగా, ఈ రోజు విరాట్‌ కోహ్లీ ప్రకటించారు. నెక్ట్స్ కెప్టెన్‌ ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్‌లో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందు వరకు నెక్ట్స్ సారథిగా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో బుమ్రా మూడుసార్లు టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌తో ఒకసారి, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో రెండుసార్లు బాధ్యతలు చేపట్టాడు. రోహిత్‌ గైర్హాజరుతో పెర్త్‌ టెస్టులో టీమిండియాను గెలిపించి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ రేసు నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.

 

ఇటీవల వెన్నెముక గాయం..

జూన్‌లో ఇంగ్లండ్‌‌తో జరగనున్న సిరీస్‌లో వర్క్‌లోడ్‌ కారణంగా బుమ్రా పూర్తి మ్యాచ్‌లు ఆడలేడు. ఇటీవల వెన్నెముక గాయం నుంచి కోలుకున్నాడు. అయినా బుమ్రా పూర్తి సిరీస్‌ ఆడే అవకాశం లేదు. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడలేకపోయాడు. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితిలో బుమ్రా పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు మోయలేడు.

 

శుభ్‌మన్‌ వైపు మొగ్గు..

సెలక్షన్‌ కమిటీ టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీ ఇప్పటికే వన్డే ఫార్మాట్‌లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. వైస్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రోహిత్‌ రిటైర్‌మెంట్‌ తర్వాత గిల్‌, పంత్‌ నేతృత్వంలో టీమిండియాకు టెస్ట్‌ క్రికెట్‌లో నూతన శకం ప్రారంభం కానుంది.

 

ఇంగ్లండ్‌, టీమిండియా టెస్ట్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌..

మొదటి టెస్ట్‌ : జూన్‌ 20 నుంచి జూన్‌ 24 వరకు హెడ్డింగ్లీ

రెండో టెస్ట్‌ : జులై 2 నుంచి జులై 6వరకు ఎడ్జ్‌బాస్టన్

మూడో టెస్ట్‌ : జులై 10 నుంచి జులై 14వరకు లార్డ్స్‌

నాలుగో టెస్ట్‌ : జులై 23 నుంచి జులై 27వరకు ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్

ఐదో టెస్ట్‌ : జులై 31 నుంచి ఆగస్టు 4వరకు ఓవల్‌

 

ఇవి కూడా చదవండి: