Home / Jasprit Bumrah
భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ సోమవారం ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను బుమ్రా మరియు గణేషన్ ఇద్దరూ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల వెన్నునొప్పికి శస్త్రచికిత్స కోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
Bumrah: గాయం కారణంగా.. కొద్ది రోజులుగా క్రికెట్ కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలాఖరులో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా క్రికెట్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని.. బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
Jasprit Bumrah:శ్రీలంకపై టీ20 సిరీస్‌ను నెగ్గిన టీమ్‌ఇండియా జనవరి 10 నుంచి ఆ దేశంతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. టీమ్‌ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) దూరం అయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ముందు భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుమ్రా ఎందుకు దూరమయ్యాడు? […]
గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్-2022 కు బుమ్రా దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడంపై జస్‌ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మెగా టోర్నీ నుంచి తప్పుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి బుమ్రా ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియాకు మద్దతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు.
టీమిండియాకు భారీ షాక్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2022 నుంచి టీం ఇండియా స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పేస్ గుర్రం బుమ్రా ఆడడం లేదు.
ఇటీవల కాలంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో బుమ్రా కనిపించకపోవడం చూసాము. అయితే గాయం అయిన కారణంగా ఆసియా కప్ కు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
లార్డ్స్ వేదికగా నేటి సాయంత్రం 5 గంటలకు భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని బావిస్తోంది. తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన భారత్... ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది.
టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ భరతం పట్టారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో, తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్