Ahmedabad: ఐపీఎల్ తొలి మ్యాచ్ పై అనుమానాలు..? కారణమేంటంటే
ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభ వేడుకుల కోసం నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
Ahmedabad: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) రానే వచ్చింది. మార్చి 31 న ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభం కానుంది. గత ఏడాది ట్రోఫిని ముద్దాడిన గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి పోరుతో ఈ సీజన్ మొదలుకానుంది. అందుకు కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గుజరాత్ లోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో స్టార్ట్స్ రష్మిక మంధాన, తమన్నా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
వరుణుడు అడ్డు పడితే..(Ahmedabad)
అయితే, ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ , ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. శుక్రవారం జరగబోయే మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చిరికల వల్ల తెలుస్తోంది. దీంతో సీజన్ లోని మొదటి మ్యాచ్ జరుగుతుందో.. లేదో అనే అనుమానాలు తలెత్తాయి. కాగా, అహ్మదాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో గుజరాత్, చెన్నై జట్ల ప్రాక్టీస్ సెషన్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే శుక్రవారం ఉదయం నుంచి అహ్మదాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడితే ఎలా అనే టెన్షన్ మొదలైంది.
ఫ్యాన్స్ లో టెన్షన్
ఈ క్రమంలో వాతావరణ శాఖ మాత్రం .. రాబోయే 24 గంటల్లో అహ్మదాబాద్ ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండవని తెలిపింది. వర్షం కురిసే సూచనలు ప్రస్తుతానికి లేవని స్పష్టం చేసింది. కానీ , క్రికెట్ అభిమానుల్లో మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. ఇక ఐపీఎల్ సీజన్ 16 ప్రారంభ వేడుకుల కోసం నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకుముందు 6 గంటల నుంచి సీజన్ ప్రారంభోత్పవాలు జరుగుతాయి. ఈ వేడుకలను స్టార్ స్పోర్ట్స్ , జియో సినిమాలో లైవ్ లో వీక్షించొచ్చు.