Prem Kumar Movie Review : సంతోష్ శోభన్ “ప్రేమ్ కుమార్” సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే ?

  • Written By:
  • Updated On - August 18, 2023 / 05:53 PM IST

Cast & Crew

  • సంతోష్ శోభన్ (Hero)
  • రాశి సింగ్, రుచితా సాధినేని (Heroine)
  • కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు (Cast)
  • అభిషేక్ మహర్షి (Director)
  • శివప్రసాద్ పన్నీరు (Producer)
  • ఎస్. అనంత్ శ్రీకర్ (Music)
  • రాంపీ నందిగాం (Cinematography)
3

Prem Kumar Movie Review : వినూత్న కథలతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సంతోష్ శోభన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ యంగ్ హీరో.. తను నేను చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా సంతోష్ శోభన్, రాశి సింగ్ జంటగా నటించిన సినిమా “ప్రేమ్ కుమార్”. ఈ సినిమాతో తొలిసారిగా డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అభిషేక్ మహర్షి. అలానే రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శివప్రసాద్ పన్నీరు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని లుక్స్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్) కు ఇప్పటికీ ఎన్నో సంబంధాలు వస్తాయి. కానీ అవి ఏవి కుదరవు. అయితే అనుకోకుండా ఒక సంబంధం కుదురుతుంది. దీంతో నేత్ర (రాశి సింగ్) అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ అదే సమయంలో రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి తను నేత్ర ప్రేమించుకున్నాము.. మా పెళ్లి చేయండి అంటూ పెళ్లి ఆపేస్తాడు. ఇక నేత్ర తండ్రి రాజ్ మాదిరాజు వెంటనే కూతురిని ఇచ్చి తనతో పంపించేస్తాడు. ఇక ప్రేమ్ కుమార్ కు మరో పెళ్లి కుదరగా అది కూడా క్యాన్సిల్ అవుతుంది. దీంతో తనకు పెళ్లి అవ్వట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ తో తన ఫ్రెండ్ సుందర్ లింగం (కృష్ణ తేజ) తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతాడు. ప్రేమ, పెళ్లి జంటలను విడగొట్టడమే వీళ్ళ పని. అయితే అదే సమయంలో ప్రేమ్ కుమార్ కు నేత్ర ఎదురు పడుతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన రోషన్ నేత్రను కాకుండా అంగనా (రుచితా సాధినేని) ను ఎందుకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతాడు.. మరి నేత్ర ఏం చేస్తుంది.. ప్రేమ్ కుమార్ చివరికి ఏం చేస్తాడు అనేది మిగిలిన కథలోనిది.

 

 

మూవీ రివ్యూ (Prem Kumar Movie Review).. 

పేపర్ మీద కామెడీ స్క్రీన్ మీదకు కరెక్ట్ తీసుకురాలేదేమో అని పలు సినిమాల విషయంలో అనుకుంటూ ఉంటాం. మంచి కాన్సెప్ట్ అయినా సరే తెరకెక్కించడంలో విఫలం అయ్యారని అనుకుంటాం. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ ట్రాక్ తప్పకుండా చూసుకొని ఆడియన్స్ ని అలరించారు అని చెప్పాలి. కథగా చూస్తే.. ‘ప్రేమ్ కుమార్’ ఐడియా బావుందని చెప్పవచ్చు. ఈ రోజుల్లో పెళ్లి కాని యువతీ యువకులు, తమ ప్రేయసి / జీవిత భాగస్వామిపై అనుమానం ఉన్న జంటలు ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటి వాళ్ళు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి. కథ తెలిసినట్టే అనిపిస్తున్న ఎక్కడా బోర్ కొట్టకుండా మూవీని నడిపించారు.

ఎవరెలా చేశారంటే.. 

ప్రేమ్ కుమార్ పాత్రకు సంతోష్ శోభన్ న్యాయం చేశారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మిడిల్ క్లాస్ యువకుడిలా ఉంటుంది. అంగనా పాత్రలో రుచితా సాధినేని ఉన్నంతలో చక్కగా చేశారు. సంతోష్ శోభన్, నటుడు కృష్ణ తేజ మధ్య కామెడీ సీన్లలో కెమిస్ట్రీ బావుంది. సంతోష్ శోభన్ తల్లిగా సురభి ప్రభావతి, రాశి సింగ్ తండ్రిగా రాజ్ మాదిరాజు పాత్రల పరిధి మేరకు నటించారు. హీరో ఫీలయ్యే సందర్భంలో వచ్చే పాట బావుంది. నేపథ్య సంగీతం ఓకే. బిజినెస్ పరంగా పరిమితులు ఉన్నప్పటికీ నిర్మాత బాగానే ఖర్చు చేశారు. తొలిసారి డైరెక్టర్ గా అభిషేక్ మహర్షి కథను తెరపై బాగానే చూపించే ప్రయత్నం చేశాడు. రాంపీ నందిగాం అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

కంక్లూజన్.. 

మంచి ఎంటర్టైన్మెంట్