వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా ఉప్పెన తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తన నటించిన రెండో సినిమా ‘ కొండపొలం ‘ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మూడో సినిమా “రంగరంగవైభవంగా “అంటూ మన ముందుకు వచ్చేశాడు.ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన”రంగరంగ వైభవంగా” సినిమా రివ్యూ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
కథ
రిషి(వైష్ణవ్), రాధ(కేతికా శర్మ) ఇద్దరు చిన్నప్పటి మంచి స్నేహితులు . వీళ్ళ రెండు కుటుంబాల కూడా కలిసిమెలిసి ఉంటాయి. కానీ రిషి, రాధ ఎప్పుడు చూసినా పొట్లాడుకుంటునే ఉంటారు.వీళ్ళద్దరు పెద్దయ్యాక ఒక మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారు. ఆ కాలేజీలో కూడా అస్తమానం ఇద్దరూ గొడవలు పడుతూనే ఉంటారు.రిషికి ,రాధ అంటే చాలా ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని మనసులో దాచుకుంటాడు. వీళ్ళ స్నేహం ప్రేమగా మారుతుంది అదే సమయంలో వీళ్ళ కుటుంబాల మధ్య పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి.ఆ గొడవలు ఎందుకు జరిగాయి ? వాళ్ళ రెండు కుటుంబాలను కలపడానికి రిషీ, రాధలు ఏం చేస్తారు ? వీళ్లద్దరి ప్రేమ గెలుపించుకున్నారా లేక వాళ్ళ కుటుంబాల కోసం ప్రేమను త్యాగం చేసారా అన్నది? మిగతా జరిగే కథ.
సినిమా ఎలా ఉందంటే
వైష్ణవ్, కేతికా శర్మ పాత్రలు చిన్న నాటి నుంచి సినిమా కథ మొదలు అవుతుంది. మెడికల్ కాలేజీలో రిషి, రాధ చేరిన తరువాత వాళ్ళు ఇద్దరు గొడవలు పడుతుంటారు. రిషి , రాధల మధ్య వచ్చే చిలిపి తిట్లు , వాళ్ళ మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సత్యతో వచ్చే కొన్ని సీన్స్ కామెడీగా ఉంటాయి .ఫస్ట్ హాఫ్ అలా సాగి పోతూ ఉంటుంది.ఇక సెకండాఫ్ కు వస్తే కథను కొంత సాగదీసాడమే చెప్పుకోవాలి. కాలేజి వాళ్ళు మెడికల్ క్యాంపు వేస్తారు. క్యాంపు కోసం రిషి, రాధ ఇద్దరూ చిన్న ఉరుకు వెళ్తారు అక్కడ వాళ్లిద్దరూ కలిసి వాళ్ళ కుటుంబాలను కలపడానికి ప్లాన్ చేస్తారు.ఇక్కడ కొన్ని సీన్లు ముందు సినిమాల్లో ఉన్నట్టుగా అనిపిస్తాయి.సత్య కామెడీ నవ్వులు సెకండ్ హాఫ్ కు ప్లస్ అయింది .కొన్ని సీన్లు ముందు సినిమాలను పోలి ఉంటాయి.
సినిమాలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ తెలుసుకుందాం.
ప్లస్ పాయింట్స్
1. వైష్ణవ్ , కేతిక నటన
2. దేవిశ్రీ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
3. సత్య కామెడీ
మైనస్ పాయింట్స్
1. నిదానమైన కథనం
2. సెకండ్ హాఫ్
ఒక్క మాటలో చెప్పాలంటే ‘ రంగరంగవైభవం ‘ సినిమా ఒక సారి చూడవచ్చు కొన్ని సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి.