Last Updated:

Kantara: కథకు ప్రాణం పోసిన “కాంతార”.. మూవీ రివ్యూ చూసెయ్యండి

Kantara: కథకు ప్రాణం పోసిన “కాంతార”.. మూవీ రివ్యూ చూసెయ్యండి

Cast & Crew

  • రిషబ్ శెట్టి (Hero)
  • సప్తమి గౌడ (Heroine)
  • అచ్యుత్ కుమార్ (Cast)
  • రిషబ్ శెట్టి (Director)
  • విజయ్ కిరగండూర్ (Producer)
  • అజనీష్ లోక్నాధ్ (Music)
  • అరవింద్ ఎస్.కశ్యప్ (Cinematography)
3.5

Kantara: సినిమాను భాషతో సంబంధం లేకుండా సినీలవర్స్ ఆదరిస్తుంటారు. సినిమా బాగుంది అంటే చాలు ఏ భాష చిత్రాన్నైనా ఆదిరిస్తుంటారు తెలుగు ప్రజలు.
కన్నడ చిత్రపరిశ్రమ నుండి విడుదలైన మరో చిత్రరాజం “కాంతార”. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో
గీతా ఆర్ట్స్ సంస్థ అనువాదరూపంలో విడుదల చేసింది.

కథేంటంటే..

భోగభాగ్యాలు ఉన్న ఓ రాజు ఏదో తెలియని లోటుతో మదనపడుతూండేవాడు. ఆయన ప్రశాంతతను వెతుక్కుంటూ పయనిస్తుండగా అడవిలో కనిపించిన ఓ దేవుడి శిల ఆ రాజును మంత్రముగ్దుడిని చేస్తుంది. దానితో అంతవరకూ తనలో ఉన్న చింత యావత్తును తొలగిపోతుంది. దానితో ఆ శిలను తనకు ఇచ్చేయమని, దానికి బదులుగా ఏం కావాలన్నా ఇస్తానని అక్కడి గ్రామ ప్రజలను కోరతాడు రాజు. దానికి ఆ అడవి మొత్తాన్ని సదరు ప్రజలకు ఇచ్చేయాలని, మళ్ళీ ఆ భూమిని లాక్కోవడానికి ప్రయత్నించకూడదని మాట తీసుకుంటాడు (హీరో)దేవుడు అనే వ్యక్తి. ఇక సీన్ కట్ చేస్తే 1990లో మరల ఆ అడవి భూమిని సొంతం చేసుకోవడం కోసం ఆ రాజు కుటుంబీలుకు ఏం ఎత్తులు వేశారు? దాన్ని దేవుడు అనే వ్యక్తి ఎలా అడ్డుకున్నాడు? అనేది “కాంతార” చిత్ర కథ.

నటన- సంగీతమే సినిమాకు ప్రాణం..

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టినే ఈ చిత్రంలో హీరోగా కూడా నటించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందాడని చెప్పవచ్చు. పల్లెటూరి మొరటు యువకుడిగా ఎంత హుందాగా నటించాడో, భూత కోలా ఆడుతున్న తరుణంలో దైవాంశ శంభూతునిగా అంతే దివ్యంగా కనిపించాడు. ఇదిలా ఉండగా హీరోయిన్ సప్తమి గౌడ ఎంతో సహజంగా, స్వచ్ఛంగా తన పాత్రలో చక్కగా ఇమిడిపోయి కనిపించింది. సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. నేపధ్య సంగీతంతోనూ కథను ఎలివేట్ చేసి సంగీతం మరియు సౌండ్ డిజైనింగ్ తో సినిమాని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.

మన మూలాలను, మన అస్తిత్వాన్ని మనం మరువకూడదు, కోల్పోకూడదు అనే రెండు విషయాలను ఎంతో నేర్పుతో కాంతార చిత్రం ద్వారా చెప్పారు నటుడు దర్శకుడైన రిషబ్. అజనీష్ లోక్నాధ్ సంగీతం, రిషబ్ నటన-దర్శకత్వం, భూత కోలా ఎపిసోడ్స్  మరియు సినిమా చివరి 20 నిమిషాల కోసం కాంతారను థియేటర్లో మరోసారి చూడవచ్చని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇదీ చదవండి: “ది ఘోస్ట్” రివ్యూ.. సూపరో సూపర్ అంటున్న ఫ్యాన్స్

ఇవి కూడా చదవండి: