Last Updated:

The Ghost Movie Review: “ది ఘోస్ట్” రివ్యూ.. సూపరో సూపర్ అంటున్న ఫ్యాన్స్

The Ghost Movie Review: “ది ఘోస్ట్” రివ్యూ.. సూపరో సూపర్ అంటున్న ఫ్యాన్స్

Cast & Crew

  • నాగార్జున అక్కినేని (Hero)
  • సోనాల్ చౌహాన్ (Heroine)
  • మనీశ్ చౌదరి, గుల్ పనాగ్ (Cast)
  • ప్రవీణ్‌ సత్తారు (Director)
  • శరత్ మారన్, పుష్కర్ రామ్ మోహన్ రావ్ (Producer)
  • మార్క్ కె రాబిన్ (Music)
  • ముఖేష్ (Cinematography)
3

The Ghost Movie Review: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన సోనాల్‌ చౌహాన్‌ ఈ చిత్రంలో నటించారు. కాగా ది ఘోస్ట్ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తార్ తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌‌ఎల్‌‌పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.  కాగా ఆడియన్స్ ఈ మూవీపై ఎలా స్పందిస్తున్నారో చూసేద్దామా.

సినిమా కథేంటంటే..

ఇంటర్ పోల్ ఆఫీసర్స్ విక్రమ్ (నాగార్జున), ప్రియ (సోనాల్ చౌహాన్) మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఈస్ట్ అరేబియాలో చేపట్టిన ఓ ఆపరేషన్ ను వీళ్ళిద్దరూ సక్సెస్ చేస్తారు.
లివ్ ఇన్ రిలేషన్ లో ఉండే వీరిద్దరూ చేపట్టిన మరో ఆపరేషన్ మాత్రం ఫెయిల్ అవుతుంది. దానితో ఫుల్ డిస్ట్రబ్ అయిన విక్రమ్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అతను తన మాట వినడం లేదనే కోపంతో ప్రియా అతనిని వదిలి ముంబైకు వెళ్లిపోతుంది. ఇలా ఐదేళ్ళు గడిచిన ఆ తర్వాత ఓ రోజు ఇండియా నుండి విక్రమ్ కు అను (గుల్ పనాగ్) నుండి ఓ ఫోన్ వస్తుంది. తన లైఫ్ రిస్క్ లో ఉందని, తన కూతుర్ని చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని విక్రమ్ కు చెప్పి బాధపడుతుంది. కాగా అంతకు ముందు ఉగ్రవాదులు ఇండియన్ పిల్లాడి ఒకరి కిడ్నాప్ దారుణంగా చంపేస్తారు. దానితో హుటాహుటిన విక్రమ్ ఇండియాకు చేరుకుని అనుకు అండగా ఆమె కూతురి సెక్యూరిటీ బాధ్యతను తీసుకుంటాడు.
అయితే అసలు విక్రమ్ కు అను కు ఉన్న సంబంధం ఏమిటీ? ఆమె కోసం విక్రమ్ ఎందుకు తన లైఫ్ ను రిస్క్ లో పెడతాడు? విక్రమ్ కు మళ్లీ ప్రియా ఎలా దగ్గరవుతుంది? విక్రమ్ ను చూడగానే ఏదో ఘోస్ట్ ను చూసినట్టుగా విలన్ వర్గాలు ఎందుకు భయపడ్డాయి? అనేది తెలుసుకోవాలంటే ది ఘోస్ట్ సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే

విక్రమ్ క్యారెక్టర్ లో నాగార్జున చక్కగా సెట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ లోనూ స్టైలిష్ గా కనిపించాడు. అయితే ఇంతకాలం గ్లామర్ డాల్ ఇమేజ్ ని క్యారీ చేసిన సోనాల్ చౌహాన్ ఇందులో  యాక్షన్ సీన్స్ తోనూ ఆకట్టుకుంది. విలన్ మనీశ్ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇతర ప్రధాన తారాగణం అంతా వారివారి క్యారెక్టర్స్ లో అందరూ చక్కగా నటించారు. అలానే మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం, ముఖేష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్స్ గా నిలిచాయి.

ఆడియన్స్ టాక్

ఇక ఈ సినిమా ట్విట్టర్ రివ్యూకు వస్తే నాగార్జున కంప్లీట్ యాక్షన్ మోడ్‌‌లో కనిపించాడని నెటిజన్లు అంటున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ది ఘోస్ట్ అని సినిమా హిట్ అని రివ్యూ ఇస్తున్నారు. సెకండాఫ్ సూపర్‌గా ఉందని చెప్తున్నారు. కచ్చితంగా చూడాల్సిన సినిమా అని, సినిమా ఫుల్ ప్యాక్డ్‌గా ఉందని, యాక్షన్స్ సీన్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా అంటూ ట్విట్టర్‌లో రివ్యూలు ఇస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఓవైపు పాజిటివ్, మరోవైపు నెగటివ్.. గాడ్ ఫాదర్ రివ్యూ ఏంటో చూసేద్దాం

ఇవి కూడా చదవండి: