Tollywood:
కథ
వరంగల్లో చిన్న పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ అవుతూనే ఉంటారు అసలు ఈ కిడ్నాప్లు ఎలా జరుగుతున్నాయా అని , దాన్ని ఛేదించడానికి మట్వాడ పోలీసు స్టేషన్‌కు కేశవ నాయుడు(ధన్‌రాజ్) కొత్తగా డ్యూటిలో చేరతారు. ఈ కేసును ఛేదించే సమయంలో రెండు కొత్త ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని తెలుసుకుంటారు.అప్పుడే వాళ్ళలో కొంత మంది ముఠాలోని పిల్లలను ముంబైకి పంపించాలనుకుంటారు. మరో ముఠా 8ఏళ్ళ పిల్లల గుండెని తీసేసి, వాళ్ళ మృతదేహాలను అక్కడే పడేసి వెళతారు.
రెండో ముఠా వాళ్ళను పట్టుకునే సమయంలో కేశవ్‌కు ఒక షాక్ న్యూస్ తెలుస్తుంది. పిల్లల కిడ్నాప్ వెనుక వాళ్ళ మామ(శ్రీకాంత్ అయ్యంగార్) హస్తం ఉందని తెలిసిందని. అతన్ని పట్టుకునే సమయంలో కేశవ్ ప్రమాదానికి గురి అవుతాడు. పోలీసు అధికారి మహ్మద్ ఖయ్యూం(సునీల్) కావాలనే వ్యాన్‌తో వచ్చి కేశవ్‌పై దాడి చేస్తారు.అసలు ఈ ఖయ్యూం ఎవరు? కేశవ్ పై ఎందుకు దాడి చేశారు? పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? కిడ్నాప్ చేసిన పిల్లల గుండె ఏమి చేస్తున్నరనేది ఈ కథ.
సినిమా ఎలా ఉందంటే
‘బుజ్జి.. ఇలారా’ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సినిమా టైటిల్ బాగానే పెట్టారు కానీ సినిమా కూడా బావుటుందని వెళ్ళే వాళ్ళు , సినీమాకి వెళ్ళాక షాక్ అవ్వడం ఖాయం.ఈ కథలో మనం ఊహించని ట్విస్టులు అర్థం కానీ మలుపులు అభిమానులను కూర్చోబెడతాయి. భార్య అను( చాందిని ) కేశవ్ ఇద్దరూ కలిసి వరంగల్‌కి వెళ్ళడం. అక్కడ పిల్లనుకనిపించకపోవడం.దాన్ని ఛేదించడంలోనే ఫస్ట్ హాఫ్లో సాగిపోతుంది.ఈ సినిమాలో మనం ఇంత వరకు చూడని ఎన్నో సన్నీవేశాలును చూస్తాము.ఆ సీన్లు చూశాక మీకు సెకండ్ హాఫ్ కూడా చూడాలనిపిస్తుంది.
ఈ కిడ్నాప్ వెనుక కేశవ్ తన మామ ఉన్నాడని తెలుసుకొని ,అతన్ని ఎలా ఐనా పట్టుకోవాలనుకుంటాడు. ఇదే క్రమంలో సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ అలా మొదలు అవ్వుతుంది. మనం ఊహించలేని విధంగా ట్విస్టులతో కథ ముందుకు వెళ్తుంది ఇక్కడ కొన్ని సీన్లు రబ్బరు సాగతీసినట్టు సాగుతూనే ఉంటుంది. క్లైమాక్స్ సీన్లు ఐతే అందరికీ నచ్చుతయాని చెప్పలేం. క్లైమాక్స్ లో 10 నిమిషాలు సీన్లు టాక్ మారిపోయింది. థ్రిల్లర్ సినిమా చూసేవాళ్లకు వాటికి బాగా ఇష్టపడేవారికి ‘బుజ్జి ఇలా రా’ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
నటీనటులు ఎలా చేశారంటే
కమెడియన్ ధన్‌రాజ్ కేశవ్ పాత్రను చేసి, సినిమాకు చేయాలిసిన న్యాయం చేశారు. ఇన్ని రోజులు కామెడీ యాంగిల్లో చూసిన ధన్‌రాజ్ ఈ సినిమాలో పోలీసు అధికారి పాత్ర చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.ఇక సునీల్ గురించి చెప్పాలంటే సీఐ మహ్మద్ ఖయ్యూంగా తన అభిమానులకు మరో సారి అలరించాడు. అంతక ముందు కూడా సునీల్ పోలీస్ పాత్రల్లో అందరినీ మెప్పించారు . హీరోయిన్ చాందినీ గురించి చెప్పాలంటే కేశవ్ భార్య అను పాత్రలో నటించి మంచి మార్కులను వేయించుకుంది. శ్రీకాంత్ అయ్యంగార్, భూపాల్‌తో తదితర నటీనటులు వాళ్ళ పాత్రల్లో బాగానే నటించారు.
ఈ సినిమాకు నేపథ్య సంగీతం సాయి కార్తీక్ అందించారు.బ్యాక్ గ్రౌండు స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు.”గరుడ వేగ ” సినిమా అంజి సినిమాటోగ్రాఫర్‌గా మంచి మార్కులను వెపించుకున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది.