Last Updated:

కరోనా : బిగ్ అలర్ట్… చైనాలో మళ్ళీ శవాలతో కిక్కిరిసిపోతున్న శ్మశానాలు..

చైనాలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాజధాని బీజింగ్‌లో డజన్ల కొద్ది శ్మశాసన వాటికలు శవాలతో నిండిపోయాయి.

కరోనా : బిగ్ అలర్ట్… చైనాలో మళ్ళీ శవాలతో కిక్కిరిసిపోతున్న శ్మశానాలు..

Corona : చైనాలో కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాజధాని బీజింగ్‌లో డజన్ల కొద్ది శ్మశాసన వాటికలు శవాలతో నిండిపోయాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది శవాలను ఖననం చేయడంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. దీనికంతటికి కారణం ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇటీవల కాలంలో బీజింగ్‌లో ఒమిక్రాన్‌ వెరియంట్‌ వైరస్‌ వాయువేగంగా ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తోంది. దీని ప్రభావంతో కేటిరింగ్‌తో పాటు డెలివిరీ సర్వీసులపై ప్రభావం పడింది. 2.2 కోట్ల జనాభా కలిగిన బీజింగ్‌లో శ్మశాసన వాటికలు పూర్తిగా నిండిపోయాయి.

ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే మృతి చెందిన శవాలను శ్మశాన వాటికలకు తీసుకువెళ్లడానికి కార్మికులు, డ్రైవర్లు అందుబాటులో లేకుండా పోయారు. వీరిలో చాలా మంది కరోనా పాజిటివ్‌తో అనారోగ్యంతో సెలవులోనో లేదా క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ నెల 7 తర్వాత నుంచి దేశంలో కోవిడ్‌తో ఎంత మంది మృతి చెందారనే విషయం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కాగా జిన్‌పింగ్‌ ప్రభుత్వం జీరో కోవిడ్‌ పాలసీని ప్రకటించింది. అటు తర్వాత నుంచి కొవిడ్‌ను నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో నిబంధనలు సడలించింది ప్రభుత్వం.

ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ప్రస్తుతం మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా ఎంత మంది మృతి చెందింది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా గత వారం అమెరికాకు చెందిన రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌ మాత్రం వచ్చే ఏడాది కోవిడ్‌ వల్ల సుమారు పది లక్షల మంది మృతి చెందే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

దీంతో చైనా పెద్ద ఎత్తున పరీక్షలు చేయాల్సి రావచ్చునని కూడా పేర్కొంది. దీంతో పాటు లాక్‌డౌన్‌లు విధించడంతో పాటు పర్యాటకులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. గత శనివారం నాడు రాయిటర్స్‌ ప్రతినిధి బీజింగ్‌లోని డాంగ్‌జియో శ్మశాసనవాటిక వద్ద 30 శవ వాహనాలను ఖననం కోసం వేచి చూస్తున్నాయని తెలిపారు.

ఇక్కడి శ్మసనవాటికకు కొద్ది దూరంలోని ఒక ప్యూనరల్‌ పార్లర్‌లో రాయిటర్స్‌ జర్నలిస్టు సుమారు 20 ఎల్లో బ్యాగ్స్‌లో నేలపై పడుకోబెట్టిన శవాలను చూశారు. అయితే ఇవి కోవిడ్‌తో మృతి చెందిన శవాలా లేక సహజ మరణాలా అనే విషయంపై స్పష్టం లేదని చెప్పాడు.కాగా ఇక్కడి శ్మశాన వాటికల్లో పనిచేసే కార్మికులు పూర్తిస్థాయి ప్రొటెక్టివ్‌ సూటులు ధిరంచి శవాలను ఖననం చేస్తున్నారు. శవాలను ఖననం చేస్తున్న క్రమంలో ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మొత్తానికి కరోనా నిబంధనలు సడలించిన తర్వాత నుంచి మృతుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని ఇక్కడ పనిచేస్తున్న పార్కింగ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతి తక్కువ కార్లతో పాటు కార్మికులు కూడా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నారు.

ఇక్కడి వస్తున్న శవాలను ఖననం చేయడానికి సిబ్బంది లేకుండా పోయారు. వస్తున్న శవాలను వెంట వెంటనే ఖననం చేయడానికి వీలుకాకుండా ఉంది. కాబట్టి కొన్ని శవాలను కొన్ని రోజుల పాటు శవాల గదిలో ఉంచి తర్వాత ఖననం చేయాల్సి వస్తోంది. స్థానికంగా ఉండే వైరో ప్యూనరల్‌ హోంలో ఒక శవాన్ని మూడు రోజు పాటు ఉంచిన తర్వాత ఖననం చేయడం జరిగిందని అక్కడ పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. ఇక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే చనిపోయిన శవాన్ని వారి కుటుంబసభ్యలే కారు శ్మశాసనవాటికకు తీసుకురావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.

చైనా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు ఈ నెల 3వ తేదీన చివరగా కొవిడ్‌తో ఎంత మంది చనిపోయారనే విషయం ప్రకటించారు. కాగా అంతకు ముందు నవంబర్‌ 23వ తేదీన చివరగా ఎంత మంది చనిపోయారనే అంశం అధికారికంగా వెల్లడించింది. కాగా చైనాకు చెందిన న్యూస్‌ ఏజెన్సీలు ఇద్దరు సీనియర్‌ జర్నలిస్టులు కొవిడ్‌ -19 కారణంగా మరణించారని పేర్కొంది. గత శనివారం నాడు 23 ఏళ్ల ఓ వైద్య విద్యార్థి ఈనెల 14వ తేదీన మరణించాడని ఓ వార్త సంస్థ వెల్లడించింది. ఇంత జరిగినా.. చైనాకు చెందిన నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ మాత్రం దేశంలో కరోనా కేసులు మొదలైన 2019 నుంచి ఇప్పటి వరకు 5,235 మంది మాత్రమే మరణించారని బుకాయిస్తోంది.

ఈ నెల ప్రారంభంలో ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ప్రభుత్వం కరోనా నిబంధనలు సడలించింది. 141 కోట్ల జనాభా కలిగిన చైనాలో ప్రజలు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించినా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. అయితే చైనా కఠినమైన కరోనా నిబంధనలు అమలు చేయడం వల్ల చాలా వరకు మృతుల సంఖ్యను అదుపు చేయగలగింది. ఒక వేళ ఈ ఏడాది జనవరి 3న కఠినమైన కరోనా నిబంధనలు ఎత్తివేసి ఉంటే మృతుల సంఖ్య 2.5 లక్షల మంది మృతి చెందే వారని చైనాకు చెందిన వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.

గత పది రోజుల నుంచి చైనా ప్రభుత్వం కొవిడ్‌తో ఎంత మంది ప్రజలు చనిపోయారనే విషయం అధికారంగా ప్రకటించడం లేదు. దీంతో పాటు కొవిడ్‌తో ఆస్పత్రుల్లో ఎంత మంది చేరారు. ఎంత మంది చికిత్స పొందుతున్నారు. ఎన్ని కేసులు సీనియస్‌గా ఉన్నాయనే విషయంపై కూడా ప్రభుత్వం అధికారిక గణాంకాలు విడుదల చేయలేదు. చైనా షోషల్‌ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దక్షిణ బీజింగ్‌లో ఈ సోమవారం నుంచి ఇక్కడి పాఠశాలు ఆన్‌ లైన్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు షాంఘై డిస్నీ రిసార్ట్‌ కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల వినోద కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

టికెట్‌ బూత్‌ లో పనిచేసే సిబ్బంది మాత్రం విధులకు రావాలంటే భయం వేస్తోందని.. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కరోనా భయంతో వణికిపోతున్నారని చెప్పారు. మొత్తానికి చైనాలో శవాలను ఖననం చేయాలన్నా క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోవిడ్‌ నిబంధనలు ప్రభుత్వం కఠినంగా అమలుచస్తే ప్రజలు తిరగబడుతున్నారు… ప్రజలకు భయపడి నిబంధనలు ఎత్తివేస్తే.. కరోనాతో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. మొత్తానికి చైనా ప్రస్తుతం సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఇవి కూడా చదవండి: