Pawan Kalyan : కాసేపట్లో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కీలక భేటీ… ఆ విషయాల గురించే చర్చ
టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కలవనున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.
Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కలవనున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. తాజాగాకుప్పంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ వెళ్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వైసీపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల జీవోలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటకు వెళ్లిన సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే పవన్ కళ్యాణ్ ఉన్న హోటల్‌కు వెళ్లి పవన్ కళ్యాణ్‌కు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కూడా అదే తరహాలో చంద్రబాబును అడ్డుకోవడంతో సంఘీభావం తెలిపేందుకు పవన్ వెళ్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నేతల భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై రెండు పార్టీల నేతల నుండి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని, వ్యతరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం తాము జనసేనతో కలిసి ముందుకువెడతామని టీడీపీకి మాత్రం దూరమని చెబుతోంది.దీనితో విపక్షాల పొత్తులపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
ఆ విషయాల గురించే చర్చ జరగనుందా..
మరోవైపు రాష్ట్రంలో బస్సు యాత్రకు పవన్ కళ్యాణ్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ మేరకు వారాహి వాహనాన్ని కూడా జనసేనాని సిద్దం చేసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుండి పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు, గుంటూరులలో జరిగిన టీడీపీ సభల్లో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 ని తీసుకువచ్చింది. రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగసభలపై నిషేధం విధించారు. విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈ జీవోను తీసుకు వచ్చారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవో పైన, దీనిపై ఎలా పోరాడాలనేద దానిపైన కూడా ఈ రోజు చంద్రబాబు, పవన్ ల మధ్య చర్చ జరిగే అవకాశముంది. ప్రస్తుతం ఈ వార్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి…
Nadendla Manohar: మంత్రి అప్పలరాజుకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓపెన్ ఛాలెంజ్.. ఏంటంటే..?
Mekapati Chandrasekhar Reddy: నాకు ఇద్దరు పెళ్లాలు ఉన్నారు.. మూడో పెళ్లాం లేదు
Janasena Party : వైసీపీ ముగ్గుల పోటీల్లో జై జనసేన అన్న యువతి.. అంబటి రాంబాబుకి షాక్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/