Published On:

Neera Cafe: సాగర తీరాన ప్రజలను చిల్ చేసేలా “నీరా కేఫ్”

కల్లుగీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా నీరా కేఫ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కలిసి ప్రారంభించారు.