Arjun Sarja Daughter: ఇటలీలో సైలెంట్‌గా స్టార్ హీరో కూతురు నిశ్చితార్థం – ఫోటోలు చూశారా?

Arjun Sarja Daughter Engagement: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. కొన్ని నెలల క్రితమే ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.

అంతలో ఆయన ఆయన చిన్న కూతురు అంజనా గుడ్‌న్యూస్ చెప్పింది. తన ప్రియుడితో ఆమె త్వరలోనే ఏడడుగులు వేయబోతోంది.

అయితే వరుడు మన దేశానికి చెందిన వాడు కాదు ఇటలీకి చెందిన వ్యక్తిని ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతోంది. ఇటలీలోనే గుట్టుచప్పుడు కాకుండ వీరి నిశ్చితార్థం కానిచ్చేశాడు అర్జున్ సర్జా.

ఇక ఎంగేజ్మెంట్ ఫోటోలను అంజనా స్వయంగా షేర్ చేస్తూ తమ రిలేషన్‌ని ఆఫీషియల్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేస్తూ.. అవును.. మీరనుకునేదే.. 13 ఏళ్ల తర్వాత నెరవేరింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ ఫోటోలో ఆమె ప్రియుడు మోకాలిపై కూర్చోని అంజనాకు ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంది.

మరో ఫోటోలో కాబోయే భర్త ఆమెను ఎత్తుకుని ఉండగా.. వెనకాల అర్జున్ సర్జా, ఐశ్వర్య దంపతులు చిరునవ్వులు చిందిస్తున్నారు.

ఆ తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత ఫ్యామిలీ అంత గ్రూప్ ఫోటో తీసుకున్నారు. వీరి కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఒకేళ ఉండటంతో చాలా రాయల్‌గా కనిపించాయి.

ప్రస్తుతం అర్జున్ చిన్న కూతురి నిశ్చితార్థం ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కన్నడ హీరో అయిన అర్జున్ సర్జా నటి నివేదితను 1988లో వివాహం చేసుకున్నాడు

వీరికి ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య, అంజన సంతానం. ఐశ్వర్య హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఇక గతేడాది నటుడు ఉమాపతి రామయ్యను ప్రేమ పెళ్లి చేసుకుంది

ఇక ఈ ఏడాది చిన్న కూతురు అంజనా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుండటం విశేషం. అంజనా సర్జా వరల్డ్ కంపెనీని స్థాపించి దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది