Last Updated:

Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్‌ను మూడు రోజుల పాటు నిలిపివేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాబోయే మూడు రోజుల పాటు కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించడానికి కొత్త పర్యాటకుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. యాత్రకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు నమోదు చేసుకోవడంతో రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్‌ను  మూడు రోజుల పాటు నిలిపివేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

Kedarnath Yatra: ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాబోయే మూడు రోజుల పాటు కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించడానికి కొత్త పర్యాటకుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. యాత్రకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు నమోదు చేసుకోవడంతో రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక శాఖ ప్రకారం, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ రెండూ నిలిపివేయబడ్డాయి.

రోజుకు గరిష్టంగా 13,000 మంది యాత్రికులు..(Kedarnath Yatra)

యాత్రికుల సౌలభ్యం మరియు యాత్ర సజావుగా సాగడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ పరిమితిని నిర్ణయించినందున రోజుకు గరిష్టంగా 13,000 మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించవచ్చు. ఎగువ గర్వాల్ హిమాలయాలలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు శీతాకాలంలో దాదాపు ఆరు నెలల మూసివేసిన తర్వాత ఏప్రిల్ 25న తెరవబడ్డాయి. ఇటీవల బాలీవుడ్ నటులు కంగనా రనౌత్ మరియు అక్షయ్ కుమార్ కూడా బాబా కేదార్‌నాథ్ ఆలయాన్ని విడివిడిగా సందర్శించారు.

ఈ నెల ప్రారంభంలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కేదార్‌నాధ్ యాత్రికుల నమోదును మే 15 వరకు నిలిపివేశారు. యాత్రికులు ఈ ప్రాంతంలో వాతావరణానికి అనుగుణంగా ఆలయానికి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించినట్లు రుద్రప్రయాగ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) విశాఖ అశోక్ భదానే తెలిపారు. చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాల్లో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తరచుగా మంచు కురుస్తోంది.ఏప్రిల్ 30న, రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులకు వాతావరణ పరిస్థితులను పరిశీలించి, యాత్రకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సలహాను ఇచ్చింది.