Last Updated:

Ujjain Rape Case: ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ కేసు: నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో కూల్చేసిన అధికారులు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పాలనా యంత్రాంగం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి బుల్డోజర్ నమూనా న్యాయాన్ని అమలు చేసింది12 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో అధికారులు కూల్చేసారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని కారణంగా వారు పేర్కొన్నారు.

Ujjain Rape Case: ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ కేసు: నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో కూల్చేసిన అధికారులు

Ujjain Rape Case: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పాలనా యంత్రాంగం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి బుల్డోజర్ నమూనా న్యాయాన్ని అమలు చేసింది12 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో అధికారులు కూల్చేసారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని కారణంగా వారు పేర్కొన్నారు.

 తప్పించుకోవడానికి ప్రయత్నించి..(Ujjain Rape Case)

సెప్టెంబరు 25న సాత్నా జిల్లాకు చెందిన మైనర్ బాలిక ఉజ్జయినికి సమీపంలో పాక్షిక నగ్నంగా రక్తస్రావంతో వీధుల్లో తిరుగుతూ సహాయం కోసం పలువురిని అభ్యర్దించింది. చివరకు ఒక ఆశ్రమం నిర్వాహకులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక అత్యాచారానికి గురయిందని నిర్దారణ అయిన తరువాత పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత భరత్ సోనీ అనే ఆటోరిక్షా డ్రైవర్ అరెస్టయ్యాడు. విచారణ సమయంలో, పోలీసు అధికారులు నేరస్థలానికి తీసుకువెడుతుండగా సోనీ కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అధికారులు వెంటనే అతన్ని పట్టుకున్నారు.నానాఖేడా బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో అతనికి చెందిన ఇల్లు మరియు దుకాణం ప్రభుత్వ స్దలంలో నిర్మించబడ్డాయని  సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపికా షిండే నివేదించారు. దీనితో బుధవారం ఈ నిర్మాణాలను బుల్డోజర్ తో నేలమట్టం చేశారు.