Raghav Chadha: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్ ఖర్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు చద్దా సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నందున దానిని తగినంత శిక్షగా పరిగణించవచ్చని అన్నారు.
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్ ఖర్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు చద్దా సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నందున దానిని తగినంత శిక్షగా పరిగణించవచ్చని అన్నారు. రాఘవ్ చద్దాపై సస్పెన్షన్‌ను నేటి నుండి నిలిపివేయడాన్ని సభ పరిశీలించవ్చని జీవీఎల్ పేర్కొన్నారు.
నా పోరాటంలో దైర్యాన్ని ఇచ్చారు..( Raghav Chadha)
పార్లమెంటు నుండి తన సస్పెన్షన్‌ను రద్దు చేయడంపై రాఘవ్ చద్దా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఈ 115 రోజుల సస్పెన్షన్‌లో, నేను మీ నుండి చాలా ప్రేమ మరియు ఆశీర్వాదాలను పొందాను. నా పోరాటంలో మీరంతా నాకు ధైర్యాన్ని ఇచ్చారని అన్నారు.ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023ని పరిశీలించడానికి ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీలో వారిని చేర్చాలని నిర్ణయించే ముందు కొంతమంది ఎంపీల నుండి అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలపై ఆగస్టు 11న రాఘవ్ చద్దా ను పార్లమెంట్ నుండి నిరవధికంగా సస్పెండ్ చేశారు.రాజ్యసభ నుండి తన నిరవధిక సస్పెన్షన్‌పై ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన సస్పెన్షన్ ఏకపక్షం మరియు చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు.ఒక ఎంపీని నిరవధికంగా సస్పెండ్ చేయడం వల్ల తమకు నచ్చిన వ్యక్తి ప్రాతినిధ్యం వహించే ప్రజల హక్కుపై చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు అప్పట్లో పేర్కొంది.