Sudhir Suri: అమృత్సర్లో శివసేన నాయకుడు సుధీర్ సూరి కాల్చివేత
పంజాబ్లోని అమృత్సర్లో శివసేన నాయకుడు సుధీర్ సూరిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలు తగలడంతో సూరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ తుది శ్వాస విడిచాడు.

Amritsar: పంజాబ్లోని అమృత్సర్లో శివసేన నాయకుడు సుధీర్ సూరిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలు తగలడంతో సూరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ తుది శ్వాస విడిచాడు. నగరంలోని ఒక ఆలయం వెలుపల సూరితో పాటు పార్టీకి చెందిన మరి కొందరు నాయకులు నిరసన తెలుపుతున్న సందర్బంగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఏకే 47 స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. శివసేన నేత సుధీర్ సూరి పై కాల్పులు జరిగాయి. మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాము. నిందితుడిని అరెస్టు చేసి,అతని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాము అని పోలీసు అధికారులు పేర్కొన్నారు.