Home / జాతీయం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
2022- 23లో మార్కెట్ లో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 7. 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఇండియా వార్షిక రిపోర్టు వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్టు రిపోర్టు తెలిపింది.
2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 686 కోట్లుగా ఉన్న భారత రక్షణ ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 16,000 కోట్లకు ఎగబాకాయి. 100కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులను 85 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయడంతో ఎగుమతులు 23 రెట్లు పెరిగాయి
మణిపూర్‌కు చెందిన పదకొండు మంది క్రీడా ప్రముఖుల బృందం రాష్ట్రంలోని ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ పంపింది. సంతకం చేసిన వారిలో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను కూడా ఉన్నారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాబోయే మూడు రోజుల పాటు కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించడానికి కొత్త పర్యాటకుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. యాత్రకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు నమోదు చేసుకోవడంతో రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తన ఖరీదైన ఫోన్‌ను తిరిగి పొందేందుకు రిజర్వాయర్ నుండి 42 లక్షల లీటర్ల నీటిని తోడించినందుకు ఛత్తీస్‌గఢ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నుంచి ఐదు అడుగుల వరకు నీటిని తోడివేసేందుకు మౌఖిక అనుమతి ఇచ్చారని ఇన్స్పెక్టర్ పేర్కొన్న సీనియర్ అధికారిని బాధ్యులను చేశారు.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన జస్టిస్ దినేష్ కుమార్ శర్మ తనపై వచ్చిన ఆరోపణలు 'చాలా తీవ్రమైనవి' అని అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లను అక్కడనుంచి పంపించిన నేపధ్యంలో వారు మంగళవారం తమ మెడల్స్ ను హరిద్వార్ లోని గంగానదిలో నిమజ్జనం చేస్తామని తెలిపారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ ప్రకటనలో పతకాలను నిమజ్జనం చేసిన తరువాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహారదీక్షకు కూర్చుటుంటామని తెలిపారు.
ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, కల్తీ మాఫియా.. ఇలా ఎన్నో రకాల మాఫియా గ్యాంగ్స్ ను చూశాం. అయితే మెట్రో సిటీ బెంగళూరు లో కొత్త రకం మాఫియా హల్ చల్ చేస్తోంది. ఈ మాఫియా కారణంగా జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి.
కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు పుంజుకున్నాయి. కానీ, విమానయాన పరిశ్రమలో సిబ్బంది కొరత మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పైలట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.