Home / జాతీయం
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న సందర్భంగా బుధవారం రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ర్యాలీలో ప్రసంగించే ముందు ఆయన పుష్కర్ లోని బ్రహ్మ దేవాలయంలో పూజలు చేసి ఘాట్లను సందర్శించారు.
సహకార రంగంలో ఆహారధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని 700 లక్షల టన్నులకు పెంచేందుకు రూ.1 లక్ష కోట్ల కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.ప్రస్తుతం దేశంలో ధాన్యం నిల్వ సామర్థ్యం 1,450 లక్షల టన్నులు ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరాలను తెలియజేస్తూ చెప్పారు.
Mahindra Thar SUV: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా 5-డోర్ల థార్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.
జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ కేసులో హిందూఆరాధకుల పిటిషన్ ను సవాలు చేస్తూ ముస్లిం పక్షం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా కమిటీ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.
ప్రఖ్యాత ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ ‘సారే జహాన్ సే అచ్ఛా’ను రచించడం ద్వారా దేశానికి సేవ చేశాడని, అయితే తాను దానిని అసలు నమ్మలేదని ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ యోగేష్ సింగ్ అన్నారు.
మణిపూర్‌లో చెలరేగిన హింసపై సీబీఐ విచారణ జరిపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ITLF) కార్యదర్శి మువాన్ టోంబింగ్ కు హామీ ఇచ్చారు. వచ్చే 15 రోజుల్లో విచారణ చేపడతామని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని అమిత్ షా కోరారు.
ఒటిటి ప్లాట్‌ఫారమ్‌లకు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తప్పనిసరి చేసింది. మంత్రిత్వ శాఖ యొక్క నోటిఫికేషన్ ప్రచురణకర్తలకు పొగాకు వ్యతిరేక హెచ్చరికల కోసం కొత్త నిబంధనలను నిర్దేశించింది. కొత్త నిబంధనలను పాటించడంలో విఫలమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు మంగళవారం హరిద్వార్ చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి ఐదు రోజుల సమయం కావాలని రైతు నాయకులు కోరడంతో పథకం విరమించుకున్నారు.
ఇంటి గొడవల కారణంగా తన కుమార్తెను కత్తితో కనీసం 25 సార్లు పొడిచి చంపి, భార్యను గాయపరిచినందుకు సూరత్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.మే 18వ తేదీ రాత్రి సూరత్‌లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. 2022 జూలైలో పాట్నా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చేందుకు నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పన్నిన కుట్రకు సంబంధించి బుధవారం నాటి ఎన్ఐఏ దాడులు జరిగాయి.