Home / జాతీయం
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న నిరసనపై అధ్యక్షుడు ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాలను కమిటీ కలుస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ గురువారం తెలిపారు.బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నమోదైన పోక్సో కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు భారీ స్థాయిలో నమోదు చేస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. కాగా, తాజాగా మే నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను వివరాలు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తనకు కేంద్ర ప్రభుత్వం అందించే జెడ్ ప్లస్ భద్రతను తిరస్కరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో, ముఖ్యమంత్రి కార్యాలయం పంజాబ్ మరియు ఢిల్లీకి భద్రతా కవరేజీని అంగీకరించడానికి నిరాకరించింది. అతను రెండు ప్రదేశాలలో పంజాబ్ పోలీసు ప్రత్యేక బృందం రక్షణ పొందుతారని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్‌గా మారేందుకు శరత్ చంద్రారెడ్డి కోర్టు అనుమతి కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనను అంగీకరించింది స్పెషల్ కోర్టు. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి బెయిల్‌పై ఉన్నారు.
మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో త్రిపుర కేడర్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి రాజీవ్ సింగ్ మణిపూర్ కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులయ్యారు
గుజరాత్‌లోని రాజులా నగరానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హీరా సోలంకి సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువకులను రక్షించి ప్రశంసలు అందుకుంటున్నారు. నలుగురు యువకులు పట్వా గ్రామం సమీపంలోని సముద్ర తీరంలో చేయడానికి వెళ్లిన సందర్బంగా మునిగిపోవడం ప్రారంభించారు.
: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో ఒక ప్రధాన రహదారి కొండచరియలు విరిగిపడటంతో కనీసం 300 మంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు. ధార్చుల ఎగువన 45 కిలోమీటర్ల దూరంలోని లఖన్‌పూర్‌లో ఉన్న లిపులేఖ్-తవాఘాట్ మార్గం 100 మీటర్ల మేర కొట్టుకుపోయి, రోడ్డుపై పడడంతో ప్రయాణికులు ధార్చుల మరియు గుంజిలో చిక్కుకున్నారని జిల్లా యంత్రాంగం తెలిపింది.
మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. గురువారం ఇంఫాల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.
Telangana Formation Day 2023: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల కోసం రాష్ట్రమంతా ముస్తాబవుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 2న రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
TATA Consultancy Service: భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ఐటీ సేవల వైపు పరుగులు పెడుతున్నారు. సెల్ ఫోన్ మొదలుకుని ఇంట్లోని గ్యాడ్జెట్స్ వరకు నిత్యం మనం ఐటీ రంగం ద్వారా ఏదో ఒక రూపంలో సేవలు పొందుతూనే ఉన్నాం. కాగా ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత విలువైన భారత బ్రాండ్ ఏంటీ అంటూ ఓ సంస్థ సర్వే చేసింది.