LPG cylinders: నేటి నుండి గ్యాస్ సిలెండర్ల డెలివరీకి ఓటిపి తప్పనిసరి..100 స్మార్ట్ సిటీల్లో అమలు
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజి) సిలిండర్ల దొంగతనాన్ని చేపట్టేవారికి కేంద్రం చెక్ పెట్టింది. ఇంటివద్దకే గ్యాస్ సిలిండర్లను అందుకొనే వినియోగదార్లు ఇకపై ఓటిపితో గ్యాస్ డెలివరీని తీసుకొనేలా చేసింది. ఇందుకోసం నేటి నుండి కొత్త డెలివరీ అధెంటికేషన్ కోడ్ (డిఏసి) విధానాన్ని తీసుకొచ్చింది.
New Delhi: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజి) సిలిండర్ల దొంగతనాన్ని చేపట్టేవారికి కేంద్రం చెక్ పెట్టింది. ఇంటివద్దకే గ్యాస్ సిలిండర్లను అందుకొనే వినియోగదార్లు ఇక పై ఓటిపితో గ్యాస్ డెలివరీని తీసుకొనేలా చేసింది. ఇందుకోసం నేటి నుండి కొత్త డెలివరీ అధెంటికేషన్ కోడ్ (డిఏసి) విధానాన్ని తీసుకొచ్చింది.
తొలుత హోం డెలివరీ విధానం అమలుకు 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేశారు. ఇప్పటికే పైలట్ ప్రాజక్ట్ కింద జైపూర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలను అందుకొన్నారు. వినియోగదారుల సంతృప్తిని పరిణగణలోకి తీసుకొని అనంతరం దేశ వ్యాప్తంగా హోం డెలివరి సిలిండర్ల ఓటిపి వ్యవస్ధను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎల్పీజి సిలిండర్ డెలివరీ కొత్త విధానంలో, వారి వారి గ్యాస్ ఏజెన్సీలలో వినియోగదారులు తప్పక మొబైల్ నెంబరు రిజిష్టర్ చేసుకొని ఉండాలి. ఆ నెంబరుకు వచ్చిన ఓటిపిని డెలివరీ వ్యక్తికి చూపించాలి. అనంతరం సిలిండర్ ను పొందాల్సి ఉంటుంది. సిలిండర్‌ను బుక్ చేసుకునే వ్యక్తి తన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయకుంటే, డెలివరీ చేసే వ్యక్తి వద్ద ఉన్న యాప్ సహాయంతో రియల్ టైమ్‌లో ఓటిపిని పొందవచ్చు. కొత్త విధానంతో చిరునామా, ఫోన్ నంబర్‌కు సంబంధించి సరైన సమాచారం ఇవ్వని వినియోగదారులకు సమస్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. అటువంటి వినియోగదారులకు సిలిండర్ సరఫరా నిలిపివేయడబడతుందని పేర్కొనింది.
దేశ వ్యాప్తంగా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, వినియోగదారులు అక్రమంగా ఎల్పీజి సిలిండర్లను పొందుతున్న క్రమంలో అరికట్టేందుకు కేంద్రం కొత్తగా ఓటిపి విధానాన్ని తీసుకొచ్చింది. అయితే వాణిజ్య సిలిండర్లకు ఈ నూతన ఓటిపి సిస్టం అవసరం లేదని కేంద్ర పేర్కొనింది.