Last Updated:

Hardeep Singh Puri: చమురు కొనుగోలు చేసి మేలు చేశాం..కేంద్రమంత్రి హర్దీప్ సింగ్

Hardeep Singh Puri: చమురు కొనుగోలు చేసి మేలు చేశాం..కేంద్రమంత్రి హర్దీప్ సింగ్

India did world a favour by buying Russian oil: రష్యా నుంచి చమురు కొంటుంటే అందరూ నిందించారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఒకవైపు రష్యాలో యుద్ధం జరుగుతోంది. అక్కడ పశ్చిమ దేశాల ఆంక్షలు మరోవైపున్నాయి. అయినా వాటిని లెక్క చేయకుండా మనం కొన్నాం కాబట్టి, ప్రపంచానికెంతో మేలు చేశామని అన్నారు. భారత్ అలా చేసి ఉండకపోతే నేడు చమురు ధరలు అంతర్జాతీయంగా మండిపోయేవని అన్నారు.

ప్రాణ నష్టంతో బయటపడ్డాం..
భారత్ తీసుకునే నిర్ణయాలన్నీ ముందు చూపుతో ఉండటం శుభశూచకమని అన్నారు. నాడు కరోనా సమయంలో కూడా ఇంత పెద్ద దేశంలో, అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడ్డామని అన్నారు. ఆరోజు మనం చమురు కొనకపోయి ఉంటే, నేడు బ్యారెల్ ధర దాదాపు రూ.16 వేలు (200 డాలర్లు) ఉండేదని అన్నారు. ఇలా కొనడం తో భారత్ పై ఆంక్షలు పడే అవకాశం ఉందని, చాలామంది దుష్ప్రచారం చేశారన్నారు. ధరల పరంగా ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడి నుంచే కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. భారత పౌరులకు స్థిరమైన ధరలో పెట్రోలు అందించడమే ప్రథమ బాధ్యతని అన్నారు.

ఇవి కూడా చదవండి: