Last Updated:

Rahul Gandhi: రాహుల్‌పై వేటు.. విపక్ష పార్టీలు ఏమన్నాయంటే?

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: రాహుల్‌పై వేటు..  విపక్ష పార్టీలు ఏమన్నాయంటే?

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా కూడా విధించింది.

స్పందించిన విపక్షాలు.. (Rahul Gandhi)

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జైలు శిక్ష పడిన రాహుల్‌ గాంధీ.. ఇప్పుడు పార్లమెంట్‌ పదవికి దూరమయ్యారు. దీంతో పలువురు ప్రతిపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. దాంతో పాటు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అనర్హత వేటు పడటంతో.. రాహుుల్ గాంధీ స్పందించారు. నేను భారతదేశ స్వరం కోసం పోరాడుతున్నాను. ఎంత ఖర్చయినా చెల్లించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు.

స్పందించిన కేసీఆర్..

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం దేశంలో రాజకీయ దుమారానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని పలువురు విపక్ష పార్టీలకు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చీకటి రోజు అని, ప్రజాస్వామ్యం మరింత పతనమైందంటూ ట్విటర్‌ వేదికగా మోదీ సర్కారును దుయ్యబడుతున్నారు.

అనర్హత వేటుపై సీఎం కేసీఆర్ స్పందించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యంగా సంస్థల్ని దుర్వినియోగం చేయడమే కాకుండా.. ప్రజాస్వామ్యాన్ని అణచి వేస్తోందని మండిపడ్డారు. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోందని.. ప్రతిపక్ష నేతలను వేధించడం అలవాటుగా మారిందని తెలిపారు. భాజపా ప్రభుత్వ దుశ్చర్యను దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని తెలిపారు.

రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి అనర్హత వేటు వేయడం విస్మయం కలిగిస్తోందని ఆప్‌ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. యావత్‌ దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. అహంకారంతో వ్యవహరిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాహుల్‌ గాంధీ అనర్హత వేటుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ అంశంలో చూపిన తొందరపాటు అత్యంత అప్రజాస్వామికం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలనే టార్గెట్ చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

ప్రతిపక్ష నేతలను వారి ప్రసంగాల కారణంగా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం నేడు మరింత పతనమవడాన్ని మనం చూస్తున్నాం అని ట్వీట్ చేశారు.

ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. అన్ని సంస్థలు కేంద్రం ఒత్తిడితో పనిచేస్తున్నాయి. దేశాన్ని దోచుకుంటున్న దొంగను దొంగ అని పిలవడం కూడా నేరమైంది.

నియంతృత్వ పాలనకు ముగింపు పలికే సమయం ఆరంభమైంది. ఈ పోరాటానికి ఇప్పుడు ఓ దిశ అవసరం – మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే

 

కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు నిర్ణయం రావడం ఆశ్చర్యకరం.

పైగా ఆ తీర్పుపై అప్పీల్‌ చేసేందుకు చర్యలు చేపడుతుండగానే ఆయనను అనర్హుడిగా ప్రకటించారు. నిర్దాక్ష్య రాజకీయాలకు ఇదే నిదర్శనం.

ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ అన్నారు.