Last Updated:

Pawan Kalyan Health Update: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. అందుకే మీటింగ్‌కు రాలేదు!

Pawan Kalyan Health Update: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. అందుకే మీటింగ్‌కు రాలేదు!

AP Deputy CM Pawan Kalyan Suffering With Severe Back Pain: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థతకు గురయ్యారని, ఆయన రెండు రోజులుగా తీవ్రమైన నడుము నొప్పి కారణంగా సమావేశాలకు హాజరుకావడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో నాదేండ్ల మనోహర్ మాట్లాడారు.

పవన్ కల్యాణ్‌ గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడుమునొప్పి తీవ్రంగా ఉండడంతో సమావేశానికి రాలేదని చెప్పారు. ఇంకా రెండు నుంచి మూడు రోజుల్లో ఆయన విధులకు హాజరవుతారని తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ కల్యాణ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడెలా ఉన్నారని మనోహర్‌ను అడిగారు. దీనికి మనోహర్.. ప్రస్తుతం పర్వాలేదని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను మాత్రమే ఆహ్వానించారు. అంతేకాకుండా సంబంధిత శాఖ కార్యదర్శిని ఆ శాఖ మంత్రి పక్కనే కూర్చేలా ప్లాన్ చేశారు. అలాగే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇఛ్చేందుకు టైమర్ కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు.