Last Updated:

By Elections: 6 రాష్ట్రాలు.. 7 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలకు పోలింగ్

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు ఇవాళ పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్‌ కొనసాగనున్నది.

By Elections: 6 రాష్ట్రాలు.. 7 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలకు పోలింగ్

By Elections: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు ఇవాళ పోలింగ్‌ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్‌ కొనసాగనున్నది.

బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్ నియోజకవర్గాలకు, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు), హర్యానాలోని అదమ్‌పూర్, తెలంగాణలోని మునుగోడు, యూపీలోని గోల గోకర్‌నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరణించడం, మరికొన్నింటిలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. గత నెలలో ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవగా.. నేడు ఉపఎన్నికల పోలింగ్ జరుగుతుంది ఈ నెల 6న ఓట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: మునుగోడులో మొదలైన పోలింగ్

ఇవి కూడా చదవండి: